Baahubali fame Prabhas’ brother convicted

Baahubali fame prabhas brother convicted

Prabhas, Prabodh, Baahubali, jail for Prabhas brother, Prabhas brother Prabodh

Bahubali fame in a cheque bounce case.The court ordered Prabodh to pay Rs 80 lakh within two months in connection with a Rs 43 lakh cheque bounce case filed by a Secunderabad-based businessman.

షాక్: ప్రభాస్ సోదరుడికి ఏడాది జైలు శిక్ష

Posted: 03/16/2016 11:55 AM IST
Baahubali fame prabhas brother convicted

ప్రభాస్ ఇప్పుడు తెలుగు సినిమాలోనే కాదు... దేశం మొత్తం తెలిసిన పేరు. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఆకాశానికి ఎగిరింది. అయితే ప్రస్తుతం బాహుబలి2 సినిమా షూటింగ్ లో ఉన్న ప్రభాస్ కు షాక్ తగిలింది. తన సోదరుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టిచ్చిన తీర్పుతో ఖంగుతిన్నారు. తెలుగు ఇండస్ర్టీలో వెలుగుతున్న ప్రభాస్ తమ్ముడికే ఇలా జరగడంతో సినీ వర్గాల్లో దీని మీద చర్చ సాగుతోంది. కాగా చెక్ బౌన్స్ కేసులో ప్రభాస్ సోదరుడు ప్రభోద్ కు ఏడాది జైలు, రెండు నెలల టైంలో 80లక్షలు చెల్లించాలని రాజేంద్రనగర్ మేజస్ట్రేట్ తీర్పునిచ్చారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ప్రభాస్ సోదరుడు తీసుకున్న అప్పు ప్రభాస్ సినిమా నిర్మాణం కోసమే.

ప్రభాస్ హీరోగా వచ్చిన బిల్లా సినిమా బారీ అంచనాలతో వచ్చి.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఉసూరుమంది. అయితే ఈ సినిమాకు ప్రభోద్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా నిర్మాణం కోసమని గతంలో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారి వద్ద నలభై మూడు లక్షలు అప్పు తీసుకున్నారు. అయితే తీసుకున్న అప్పు చెల్లించాలని ఆ వ్యాపారి ఒత్తిడి తీసుకురాగా..నలభై మూడు లక్షల చెక్కును అందించాడు ప్రభోద్. కానీ ఆ చెక్ బౌన్స్ కావడం.. తర్వాత మరో చెక్ ఇవ్వడం అది కూడా బౌన్స్ కావడం జరిగింది. దీంతో ఆ వ్యాపారవేత్త కోర్టును ఆశ్రయించారు. నిన్న రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ కోర్టు ప్రభోద్ కు ఏడాది జైలు, రెండు నెలల్లో 80లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Prabodh  Baahubali  jail for Prabhas brother  Prabhas brother Prabodh  

Other Articles