Pawan Kalyan | Kushi 2 | SJ Surya | Anoop Rubens

Pawan kalyan kushi 2 music starts

Pawan Kalyan Kushi 2 Music starts, Pawan Kalyan Kushi 2 latest updates, Pawan Kalyan Kushi 2 confirmed, Pawan Kalyan Kushi 2 Music, Pawan Kalyan Kushi sequel updates, Pawan Kalyan latest stills, Pawan Kalyan movies, Pawan Kalyan movie updates, Pawan Kalyan

Pawan Kalyan Kushi 2 Music starts: Powerstar Pawan kalyan upcoming film Kushi2. SJ Surya Director, Anoop rubens music. AM Ratnam Producer.

పవన్ కళ్యాణ్ ‘ఖుషీ2’ మ్యూజిక్ స్టార్ట్

Posted: 03/14/2016 11:37 AM IST
Pawan kalyan kushi 2 music starts

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ను తెచ్చిపెట్టిన చిత్రం ‘ఖుషీ’. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. పవన్ సరసన భూమిక హీరోయిన్ గా నటించింది. 27 April 2001లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

పవన్ కళ్యాణ్ కు భారీ బ్రేక్ ను అందించింది. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుంది. మళ్లీ వీరి కాంబినేషన్లోనే ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రూపొందనున్న ‘ఖుషీ2’ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. అయితే ఈ సీక్వెల్ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే స్ర్కిప్ట్ వర్క్ పూర్తిచేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రముఖ పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి ఈ చిత్రానికి సాహిత్యాన్ని అందిస్తున్నారు. ఈ విషయాన్ని రామజోగయ్యశాస్త్రి తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఓ ఫోటోను పోస్ట్ చేసాడు. ఇందులో రచయిత ఆకుల శివ, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, దర్శకుడు ఎస్.జె.సూర్యలతో పాటు రామజోగయ్య శాస్త్రిలను చూడవచ్చు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్-అనూప్ ల కాంబినేషన్లో ‘గోపాల గోపాల’ వంటి మ్యూజికల్ హిట్ చిత్రం వచ్చింది. ఈ సినిమాకు అనూప్ అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ఆడియో వేడుకలోనే పవన్ తన తర్వాతీ చిత్రానికి అనూప్ అవకాశం ఇస్తానని మాట ఇచ్చినట్లుగానే... ‘ఖుషీ2’ చిత్రానికి అవకాశం ఇచ్చి పవన్ తన మాట నిలబెట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వివరాలను మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టేసారు. ఈ సీక్వెల్ ప్రాజెక్టులో భాగంగా తెలుగు వర్షెన్ లో పవన్ కళ్యాణ్, తమిళ వర్షెన్ లో విజయ్ నటించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరకుంది. ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా, గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Kushi2  SJ Surya  Anoop Rubens  stills  

Other Articles