Sardaar Gabbar Singh | stills | Audio Release Date | Pawan Kalyan | Teaser

Pawan kalyan dedicates sardaar gabbar singh

Pawan Kalyan Dedicates Sardaar Gabbar Singh, Pawan Kalyan Dedicates Sardaar Gabbar Singh to his fans, Sardaar Gabbar Singh shooting stills, Sardaar Gabbar Singh overseas rights sold out, Sardaar Gabbar Singh Audio Release Date, Sardaar Gabbar Singh Teaser Pawan kalyan Sardaar Gabbar singh Bike, Sardaar Gabbar singh Movie news, Sardaar Gabbar singh stills, Pawan kalyan movie news, Pawan kalyan movie updates, Pawan kalyan stills, Sanjana, Raai Laxmi, Kajal agarwal

Pawan Kalyan Dedicates Sardaar Gabbar Singh: Power star pawan kalyan latest film Sardaar Gabbar singh. pawan kalyan dedicates this film to his fans. bobby director, devi sri prasad music. kajal heroine. Pawan kalyan movie shooting updates and details.

అభిమానులకు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అంకితం

Posted: 03/12/2016 10:10 AM IST
Pawan kalyan dedicates sardaar gabbar singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విడుదల తేది దగ్గరపడుతుండటంతో షూటింగ్ తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేసారు.

‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై శరత్ మరార్, సునీల్ లుల్లాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ పురాతన భవనంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తన అభిమానులకు అంకితమిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.

తాజా సమాచారం ప్రకారం మార్చి 19న నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుక జరగనుందని తెలుస్తోంది. సౌత్ ఇండియన్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో విడుదల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రాయ్ లక్ష్మీ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Dedicates  Sardaar Gabbar Singh  shooting stills  Audio Release Date  posters  

Other Articles