Hero Nithi Posted A..aa pre look poster in his facebook

Hero nithi posted a aa pre look poster in his facebook

Nithin, A..aa prelook, A..Aa posters, Trivikram, Trivikram Srinivas

Hero Nithin posted his film A..aa pre look through facebook. Trivikram Srinivas directing this cinema. Samantha is a heroine.

అ..ఆ ప్రిలుక్ పోస్టర్ ను పోస్ట్ చేసిన నితిన్

Posted: 03/11/2016 04:21 PM IST
Hero nithi posted a aa pre look poster in his facebook

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నితిన్ తో చేస్తున్న సినిమా అ..ఆ. తాజాగా ఈ సినిమా ప్రిలుక్ ను హీరో నితిన్ తన ఫేస్ బుక్ ద్వారా షేర్ చేశాడు. వైజాగ్, పొల్లాచ్చి ప్రాంతాల్లో ఈ సినిమా మేజర్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు సాగితే మే 6న ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధంగా ఉందని తెలిసింది. కాగా ఈ సినిమాకు మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని అందిస్తుండగా, హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ దీన్ని నిర్మిస్తున్నారు. వచ్చే వీకెండ్‌లో ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేయనున్నారని తెలిసింది.

ఇష్క్ సినిమాతో కెరీర్ లో బిగ్ హిట్ కొట్టిన నితిన్ తర్వాత వరుస విజయాలతో బిగ్ స్టార్ గా ఎదిగాడు. హీరోగానే కాకుండా సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ ను ప్రారంభించారు. తాజా చిత్రం అ.. ఆ సినిమా అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి ట్యాగ్ లైన్. సమంతా, అనుపమ పరమేశ్వరన్ కథానాయికలు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా మే 6న ప్రేక్షకులముందుకురానుంది. త్వరలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నారు. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఆహ్లాదభరిత ప్రేమకథా చిత్రమిది. ఆనంద్‌విహారిగా నితిన్ పాత్ర చిత్రణ నవ్యపంథాలో వుంటుంది. త్రివిక్రమ్ తనదైన శైలి సంభాషణలు, హాస్యంతో తెరకెక్కించారు. ఈ వేసవిలో అన్ని వర్గాలను మెప్పించే చిత్రమవుతుంది అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithin  A..aa prelook  A..Aa posters  Trivikram  Trivikram Srinivas  

Other Articles