Sardar Gabbar Singh release date fixed

Sardar gabbar singh release date fixed

Sardar, Sardar Gabbar Singh, Pawan Kalyan, Power Star Pawan Kalyan

Power Star PawanKalyan next film Sardar Gabbar Singh release date announced by director Sharath Marara. He posted some photos and release date in his social media.

సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చే వారంలో ఆడియో

Posted: 03/10/2016 05:39 PM IST
Sardar gabbar singh release date fixed

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ స్పీడ్ గా పూర్తి చేసుకుంటోంది. . టీజర్, పోస్టర్స్ తో భారీ అంచనాలు పెట్టుకోన్న ఈ సినిమాను ప్రకటించిన డేట్ కే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ శరవేగంగా జరుపుకొంటుంది. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా తెరకెక్కుతున్నదని చిత్ర యూనిట్ తెలిపింది. ఒక వైపు షూటింగ్ జరుపుకొంటూనే.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసుకొంటుంది. కొద్దిరోజులుగా హైదరాబాద్ లో షూటింగ్ జరపుకొంటున్న సర్దార్ ఇటీవలే టైటిల్ సాంగ్ చిత్రీకరణను పూర్తి చేసుకొని.. ప్రస్తుతం క్లైమాక్స్ ఫైట్ ను జరుపుకొంటుంది. ఈ ఫైట్ హైదరాబాద్ లోని ఓ పాత భవనంలో పవన్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటున్నారు. భారీ ఎత్తున చిత్రీకరణ జరుపుకొంటున్న ఫైట్ సీన్స్ ను ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ల ఆధ్వర్యంలో షూటింగ్ జరుపుకొంటుంది. ఈ ఫైట్ చిత్రీకరణ అనంతరం రెండు పాటల చిత్రీకరణ కోసం స్విట్జర్లాండ్ చిత్ర యూనిట్ వెళ్లనున్నది. దీంతో సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని గుమ్మడి కాయ కొట్టేసుకొంటుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నాడు.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్నస‌ర్ధార్ గ‌బ్బర్ సింగ్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఏప్రిల్ 8న స‌ర్ధార్ సినిమాని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నట్టు నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ గ‌తంలో ప్రక‌టించారు. అయితే స‌ర్ధార్ రిలీజ్ డేట్ కి నెల రోజులు మాత్రమే టైం ఉండ‌డం...ఇంకా షూటింగ్ జ‌రుగుతుండ‌డంతో సినిమా వాయిదా పడే అవ‌కాశం ఉందంటూ ప్రచారం ప్రారంభ‌మైంది. ఈ ప్రచారానికి తెరదించేలా స‌ర్ధార్ నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ ట్విట్టర్ లో... స‌ర్ధార్ గ‌బ్బర్ సింగ్, కానిస్టేబుల్, గ‌న్స్ అండ్ గ్యాంగ్స్ అంద‌రూ ఏప్రిల్ 8న సినిమాని  రిలీజ్ చేసేందుకు క‌ష్టప‌డుతున్నారంటూ ప‌వ‌న్, ఆలీ త‌దిత‌రులు ఉన్న వ‌ర్కింగ్ స్టిల్ ఒక‌టి పోస్ట్ చేసారు. నెక్ట్స్ వీకెండ్ ఆడియో రిలీజ్ ఉంటుంది. త్వర‌లోనే ఆడియో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తాం. స‌ర్ధార్ సినిమాని మాత్రం ఏప్రిల్ 8న రిలీజ్ చేయ‌నున్నాం అంటూ స్పందించారు .సో...స‌ర్ధార్ ఏప్రిల్ 8న రిలీజ్ అవ్వడం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sardar  Sardar Gabbar Singh  Pawan Kalyan  Power Star Pawan Kalyan  

Other Articles