Surya | 24 film | Teaser | Posters | Samantha

Surya 24 teaser release on 4 march

surya 24 movie first look, surya 24 first look, surya 24 movie news, surya 24 posters, surya 24 movie stills, surya 24 movie updates, Surya movies, Surya movie updates, Surya stills, Samantha

surya 24 teaser release on 4 march: Hero Surya upcoming film 24. Vikram kumar direction, Samantha heroine, AR Rahaman music. first look posters released.

కన్ఫర్మ్: మార్చి 4న సూర్య ‘24’ టీజర్ విడుదల

Posted: 03/02/2016 01:23 PM IST
Surya 24 teaser release on 4 march

‘ఇష్క్’, ‘మనం’ చిత్రాల దర్శకుడు విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘24’. ఈ చిత్రాన్ని సూర్య తన సొంత బ్యానర్ అయినటువంటి 2D ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. సూర్య సరసన సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో సూర్య పలు విభిన్న గెటప్ లలో కనిపిస్తున్నాడు. అయితే ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను మొదటగా ఫిబ్రవరి 24న విడుదల చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 29కి వాయిదా వేసారు. కానీ కొన్ని అనివార్య కారణాల మళ్లీ వాయిదా వేసి, చివరకు మార్చి 4కు ఫిక్స్ అయ్యారు.

‘24’ ఫస్ట్ లుక్ టీజర్ మార్చి 4, సాయంత్రం 6గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా సూర్య తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మరి ఇందులో సూర్య ఎలా వుండబోతున్నాడోనని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలుగు, తమిళం భాషలలో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

శ్రేష్ట్ మూవీస్, గ్లోబల్ మూవీస్ సంయుక్తంగా ‘24’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 16 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya  24  first look  posters  samantha  stills  

Other Articles