Nayaki | Trisha | Motion Poster | Release date

Trisha nayaki release on march

Trisha Nayaki Release Date, Nayaki Motion Song Poster, Trisha Nayaki Poster, Trisha latest movie news, Trisha Nayaki movie news, Trisha Nayaki stills, Trisha latest news, Trisha movie news, Trisha movie updates, Trisha stills, Trisha

Trisha Nayaki Release on March: Nayaki Telugu Motion Song Poster ft Trisha and Ganesh Venkatraman, exclusively on Giridhar Productions. Music composed by Raghu Kunche. Directed by Govi Goverdhan and produced by Giridhar Mamidipally.

మార్చిలో రాబోతున్న త్రిష ‘నాయకి’

Posted: 02/27/2016 05:47 PM IST
Trisha nayaki release on march

త్రిష టైటిల్ పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'నాయకి, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రమిది. గోవి దర్శకుడు. రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి నిర్మిస్తున్నారు. కాగా షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమా లను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రం వీడియో మోషన్ పోస్టర్ను శుక్రవారం రాత్రి హైదరాబాద్లో కథానాయిక త్రిష ఆవిష్కరించారు.

దర్శకుడు గోవి మాట్లాడుతూ...."హారర్ జోనర్ చిత్రాలలో కొత్తరకమైన చిత్రమిది. కెరీర్లోనే అత్యున్నత నటనను తన పాత్రలో త్రిష ప్రదర్శించింది. ఆమె పాత్రకు విభి న్నకోణాలుంటాయి. త్రిషతో పాటు మా అందరికీ ఇది ఓ మంచి చిత్రమవుతుంది. అభిరుచి కలిగిన నిర్మాతలు ఈ చిత్రాన్ని చేస్తుండటంతో అనుకున్నవిధంగా చిత్రం ఎంతోబాగా వచ్చింది' అని అన్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.... మార్చి రెండోవారంలో ఆడియోను, అదే నెలాఖరుకు సినిమాను విడు దల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ చిత్రంలో గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, జీవీ, సత్యంరాజేష్, జయ ప్రకాష్, సుష్మరాజ్, కోవై సరళ, మనోబాల తదితరులు తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జగదీష్ చీకటి, సంగీతం: రఘు కుంచె, పాటలు: భాస్కరభట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాంబాబు కుంపట్ల, కళ కె.వి.రమణ, కూర్పు: గౌతంరాజు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trisha  Nayaki  Release Date  Motion Song  Posters  stills  

Other Articles