Sai Korrapati | Nenu Producer | Vaarahi Chalana chitram | Guntur Talkies

Sai korrapati offer nenu producer

Sai Korrapati Nenu Producer, Sai Korrapati latest news, Sai Korrapati movies, Guntur Talkies movie updates, Nenu Producer updates, Telugu movies

Sai Korrapati Offer Nenu Producer: Tollywood producer Sai Korrapati latest offer Nenu Producer. Nenu producer offer starts with Guntur talkies.

ఒక్క సినిమాకు ఊరూరా నిర్మాతలు

Posted: 02/26/2016 04:26 PM IST
Sai korrapati offer nenu producer

‘ఈగ’, ‘అందాల రాక్షసి’, ‘లెజెండ్’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించిన నిర్మాణ సంస్థ ‘వారాహి చలన చిత్రం’. ఈ బ్యానర్ పై తెలుగులో మంచి చిత్రాలను అందిస్తున్న నిర్మాత సాయి కొర్రపాటి తాజాగా డిస్ట్రిబ్యూటర్లకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించాడు.

‘నేను ప్రొడ్యూసర్’ అనే కొత్త కాన్సెప్టుతో ముందుకొచ్చాడు సాయికొర్రపాటి. ఈ కాన్సెప్ట్ ప్రకారం ఒకే సినిమాకు ఊరురా నిర్మాతలు మారిపోతూ వుంటారట. అంటే సినిమాను తమ సొంత ప్రాంతంలో విడుదల చేసేందుకు ఎవ్వరైనా ముందుకు రావొచ్చు. అలా వచ్చిన వారి పేరునే ఆ ప్రాంతానికి ప్రొడ్యూసర్‌గా ప్రచారం కల్పిస్తారు.

సాయి కొర్రపాటి ఏర్పాటుచేసిన nenuproducer.com అనే వెబ్ సైట్లోకి వెళ్లి, ఎవరైనా తమ ప్రాంతంలో సినిమాను విడుదల చేసేందుకు బిడ్ దాఖలు చేసుకోవచ్చు. ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకుంటారో వాళ్ళను అక్కడి నిర్మాతగా ప్రకటిస్తారు. ఈ ఆలోచనను ‘గుంటూర్ టాకీస్’ సినిమాతో శ్రీకారం చుట్టారు సాయి కొర్రపాటి. మరి ఈ సినిమాకు ఎంత మంది నిర్మాతలుగా మారనున్నారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Korrapati  Nenu Producer  Vaarahi Chalana chitram  Guntur Talkies  

Other Articles