Padesave | Release Date | Platinum Disc Function | Trailers

Padesave release on 26 feb

Padesave Platinum Disc Function, Padesave release date, Padesave trailers, Padesave stills, Padesave reviews, Padesave

Padesave Release on 26 feb: Karthik raju, nithya shetty, sham acts in lead roles. chuniya direction. anoop music.

రేపే చునియా ‘ప‌డేసావే’ విడుదల

Posted: 02/25/2016 09:44 AM IST
Padesave release on 26 feb

అక్కినేని నాగార్జున ప్రోత్సాహంతో అయాన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై చునియా ద‌ర్శ‌క‌త్వంలో కార్తీక్ రాజు, నిత్యాశెట్టి, శామ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ప‌డేసావే’. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 26న విడుదలవుతుంది. ఈ సందర్భంగా..

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.... అనూప్ మ్యూజిక్ పెద్ద హిట్టయింది. చునియా ఏదో నాకు బాగా తెలుసుకదా అని ఈ సినిమా ప్రమోషన్ విషయంలో నేను ఆమెకు అండగా నిలబడలేదు. ఏడెనిమిది నెలలకు ముందు చునియా ఈ కథను చెప్పి సినిమాను ప్రమోట్ చేయడానికి నాకు సపోర్ట్ చేస్తారా అని అడిగింది. అయితే నేను ముందు సినిమా తీయ్ తర్వాత చూద్దాం అన్నాను. అలాగే సినిమా తీసిన తర్వాత చూశాను. సినిమా చూస్తున్నంత సేపు హాయిగా ఫీలయ్యాను. సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయాను. యంగ్ యూత్, యంగ్ ఫ్యామిలీస్ కి నచ్చే చిత్రమవుతుంది. అందుకే ఇప్పుడు సినిమాకు ప్రమోషన్ విషయంలో నావంతుగా సపోర్ట్ చేస్తున్నాను. చిన్న ప్రయత్నం కాదు, పెద్ద ప్రయత్నమిది. ఈ చిన్న చిత్రం పెద్ద సక్సెస్ అయితే కొత్త వారికి ఉత్సాహాన్నిచ్చినట్టు అవుతుంది. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

చునియా మాట్లాడుతూ.... పదిహేనేళ్ళ క్రితం ఇండస్ట్రీలోకి వచ్చాను. దర్శకురాలిగా నన్ను నేను నిరూపించుకోవడానికి అనేక సంస్థల్లో పనిచేశాను. ఇప్పుడు దర్శకురాలిగా మీ ముందుకు వచ్చాను. నా కల తీరిందంటే కారణం నాగార్జునగారే. ఆయన కొత్తవాళ్ళకి ఎప్పుడూ అండగా నిలబడుతుంటారు. ఇప్పుడు కూడా ఆయన అలాగే సినిమా నచ్చడంతో మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 26న మీ ముందుకు వస్తున్నాం. టు హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అన్నారు.

అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ..... చునియా పెద్ద హార్డ్ వర్కర్. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసే నాగార్జునగారు ఈ సినిమాకు అండగా నిలబడ్డారు. సినిమా సెన్సార్ లో క్లీన్ యు సర్టిఫికేట్ సంపాదించుకుందంటే అర్థం చేసుకోండి. తప్పకుండా సినిమా అన్నీ వర్గాలకు నచ్చే సినిమా అవుతుంది. పాటలను సక్సెస్ చేసిన విధంగా సినిమాను పెద్ద సక్సెస్ చేస్తారని భావిస్తున్నాం అన్నారు.

కార్తీక్ రాజు మాట్లాడుతూ.... సినిమా ఫిబ్రవరి 26న విడుదలవుతుంది. సినిమాను అందరూ ప్రేమించి చేశాం. ఈ సినిమాకు నాగార్జునగారు సపోర్ట్ చేస్తుండటం మా అదృష్టంగా భావిస్తున్నాం అన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నరేష్, విశ్వ, కృష్ణుడు, కిరణ్, అనితాచౌదరి, అనంత్ శ్రీరాం తదితరులు పాల్గొని చిత్రయూనిట్ ను అభినందించారు. యూనిట్ సభ్యులకు నాగార్జున డిస్క్ లను అందజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Padesave  release date  trailers  stills  

Other Articles