Sanjay Dutt | release date | Free Dish | fans | Mumbai Hotel

Sanjay dutt fan offering free dish on release day

Free Offer celebrating Sanjay Dutt release, Sanjay Dutt release dish, Sanjay Dutt release food, Sanjay Dutt fan celebrating, Sanjay Dutt release date, Sanjay Dutt fans

Free Offer celebrating Sanjay Dutt release: A Mumbai restaurant will celebrate Bollywood actor Sanjay Dutt's release by offering a free dish.

ఫ్రీ ఫుడ్: సంజయ్ విడుదలకు అభిమాని ఖుషీ ఆఫర్

Posted: 02/23/2016 03:23 PM IST
Sanjay dutt fan offering free dish on release day

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా వున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు తన సినిమాలతో అలరించి, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే 1993 బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ పూణెలోని ఎరవాడ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్‌కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది.

టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను మాత్రం ఐదేళ్లకు తగ్గించింది. ఈ ఏడాది అక్టోబర్‌ వరకు ఆయన శిక్ష అనుభవించాల్సి ఉన్నా....8 నెలల ముందుగానే విడుదల చేస్తున్నారు. జైల్లో సంజయ్‌దత్ ప్రవర్తన చాలా బావుందని, సత్ర్పవర్తన కారణంగా అతన్ని ముందుగా విడుదల చేస్తున్నట్లు మహారాష్ట్ర హోంశాఖ ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా వుంటే సంజయ్ దత్ కు వీరాభిమాని అయినటువంటి ఖలీద్ హకీమ్ అనే వ్యక్తి ఏకంగా తన సంతోషాన్ని ప్రకటించాడు. ఖలీద్ హకీమ్ కు ‘నూర్ మహదీ’ అనే ఓ హోటల్ వుంది. సంజయ్ దత్ జైలు నుండి విడుదలవుతున్న సందర్భంగా ఫ్రీ ఆఫర్ ప్రకటించాడు ఖలీద్. ఈనెల 25న(గురువారం) సంజయ్ దత్ జైలు నుండి విడుదలవుతున్నాడు. ఆ రోజు తమ హోటల్ కు వచ్చిన వారికి ప్రత్యేక వంటకం ‘చికెన్ సంజూ బాబా’ను ఉచితంగా వడ్డించనున్నట్లు ఖలీద్ ప్రకటించారు.

ఆ రోజు మధ్నాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు ఈ ఫ్రీ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ ప్రకటించడంపై ఖలీద్ స్పందిస్తూ... 30 ఏళ్ల క్రితం సంజయ్ దత్ తమ హోటల్ లో ఫ్యామిలీ సెక్షన్ ప్రారంభోత్సవానికి వచ్చారని, ‘చికెన్ సంజూ బాబా’ వంటకాన్ని సంజయ్ స్వయంగా తయారు చేసి తనకు కానుకగా ఇచ్చారని ఖలీద్ తెలిపారు. తరచూ సంజయ్ దత్ తమ హోటల్ కు వచ్చేవారని, ఆయనకు నాన్ వెజ్ వంటకాలంటే చాలా ఇష్టమని, ‘నల్లి నారీ’ వంటకం సంజయ్ దత్ చాలా ఇష్టంగా తింటారని ఖలీద్ తెలిపారు. సంజయ్ విడుదల ఏమోగానీ... ఖలీద్ హోటల్ గురించి మాత్రం ఫుల్ పబ్లిసిటీ అయ్యిందని చెప్పుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sanjay Dutt  Release Date  Free Dish  Mumbai Hotel  Celebrations  

Other Articles