Tamanna | Prabhudeva | AL Vijay | Movie News | stills

Tamanna romance with prabhudeva

Prabhudeva romance with Tamanna, Prabhudeva with Tamanna, Prabhudeva pairup with Tamanna, Tamanna in AL Vijay film, Prabhudeva Tamanna in AL Vijay film, Tamanna latest stills, Tamanna movies, Tamanna

Tamanna romance with Prabhudeva: Tamil Director AL Vijay next film with Prabhudeva. Milky beauty tamannah heroine. sonu sood acts in special role.

తమన్నాతో ప్రభుదేవా రొమాన్స్ ఫిక్స్

Posted: 02/01/2016 06:52 PM IST
Tamanna romance with prabhudeva

తమిళంలో వరుస హిట్ చిత్రాలతో దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపిస్తున్న దర్శకుడు ఏఎల్ విజయ్. మదరాసు పట్టణం, తాండవం, దైవ తిరుమగళ్, తలైవా పలు హిట్ చిత్రాలను అందించిన విజయ్ దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం దర్శకుడు ఓ క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేసాడు.

డాన్స్ కొరియోగ్రాఫర్ నుంచి ప్రస్తుతం యాక్టర్, డైరెక్టర్ మారిన ప్రభుదేవా హీరోగా విజయ్ ఓ సినిమా చేయనున్నారు. ఇందులో ప్రభుదేవా సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించనుంది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే... ఈ సినిమా కథ ప్రభుదేవాకు బాగా నచ్చడంతో తానే స్వయంగా నిర్మిస్తానని ముందుకొచ్చాడని తెలిసింది.

ప్రభుదేవా తన సొంత బ్యానర్ లో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నాడు. ఇందులో సోనుసూద్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ ప్రాజెక్టును తమిళం, తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో తెరకెక్కించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamanna  Prabhudeva  AL Vijay  Movie News  stills  

Other Articles