Rajinikanth | Latha | Madras HC | notices | School Issue

Madras hc issues notice to rajinikanth and latha

Madras HC issues notice to Tamil superstar Rajinikanth, Madras HC issues notice to Rajinikanth and Latha, Madras HC issues notices to Rajinikanth, Rajinikanth latest news, Rajinikanth movies, Rajinikanth movie stills

Madras HC issues notice to Rajinikanth and Latha: The Madras high court has declined to interfere with a school education department order directing superstar Rajinikanth, his wife Latha.

రజనీ ఖచ్చితంగా కోర్టులో హాజరవ్వాల్సిందే

Posted: 01/30/2016 12:24 PM IST
Madras hc issues notice to rajinikanth and latha

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన సతీమణి లతలకు మద్రాస్ హైకోర్టు సమన్లు జారీ చేసింది. చెన్నైలోని రేస్ కోర్స్ ప్రాంతంలో రజనీకాంత్ కు చెందిన ‘ఆశ్రమ్ మెట్రిక్యులేషన్ స్కూల్’ స్థలంపై గతకొంతకాలంగా కోర్టు విచారణ జరుగుతోంది. ఈ స్థల వివాదానికి సంబంధించిన విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశించింది.

జనవరి 27న విచారణకు రజనీ హాజరు కావాల్సి వుండే.. కానీ రజనీ హాజరు కాలేదు. దీంతో తమిళనాడు మెట్రిక్యులేషన్ పాఠశాలల జాయింట్ డైరెక్టర్ వారికి సమన్లు పంపారు. ఈ కేసు విషయంలో రజనీకాంత్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పాఠశాల ప్రిన్సిపాల్ వందన రిట్ పిటీషన్ వేసారు. ఈ పిటీషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.

వ్యక్తిగత హాజరు నుంచి రజనీకాంత్ కు మినహాయింపు ఇవ్వడం కుదరదని హైకోర్టు ఉత్తర్వులో స్పష్టం చేసింది. రజనీకాంత్ హాజరుకావడానికి అవసరమైతే రెండు వారాలు గడువు పెంచుతామని కోర్టు తేల్చి చెప్పేసింది. దీంతో రజనీకాంత్ ఖచ్చింతగా కోర్టులో హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  latha  Madras HC  notices  School issue  

Other Articles