స్వర్గీయ నందమూరి తారకరామారావు తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసి, తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దాదాపు చాలా కాలం నుంచి సినిమా రంగంలో నటుడిగా కొనసాగుతున్నారు బాలకృష్ణ.
ప్రస్తుతం ఆయన నటించిన 99వ చిత్రం ‘డిక్టేటర్’. మరో సినిమా చేస్తే 100 సినిమాలు పూర్తికానున్నాయి. కానీ తనకు మాత్రం ఈ 100, 150 అనే సంఖ్య మీద ఎలాంటి నమ్మకం లేదని, నిజానికి ఈ 100 సినిమాలు ఎప్పుడో పూర్తయ్యేవని, కాకపోతే నిర్మాతలు, దర్శకుల వల్లే తన సినిమాల వేగం తగ్గిందని బాలయ్య చెప్పుకొచ్చారు.
గతంలో తాను ఒకే సంవత్సరం ఏడెనిమిది సినిమాలు కూడా చేసానని, కాబట్టి... ఈ 100, 200 అనే నెంబర్ ల మీద తనకు ఆసక్తి లేదని, తాను ఎప్పటికీ నటిస్తూనే వుంటానని బాలయ్య చెప్పుకొచ్చాడు. తాను నటిస్తునే త్వరలోనే తన తనయుడు మోక్షజ్ఞ కూడా హీరోగా రాబోతున్నాడని బాలయ్య ఖరారు చేసారు.
‘డిక్టేటర్’ తర్వాత బాలయ్య చేయబోయే 100వ చిత్రం కోసం ఇప్పటికే రెండు కథలు, ఇద్దరు దర్శకులు రెడీగా వున్నారు. అందులో ఒకరు బోయపాటి శ్రీను కాగా.. మరొకరు సింగీతం శ్రీనివాస్ రావు. బాలయ్య 100వ సినిమా కోసం బోయపాటి శ్రీను ఓ పవర్ పుల్ కథను సిద్ధం చేస్తున్నారని, ఇక సింగితం శ్రీనివాస్ రావు ఇప్పటికే ‘ఆదిత్య 999’కోసం స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసి, సిద్దంగా వున్నారని... ఇందులో ఏ సినిమా తన 100వ సినిమా కానుందో సంక్రాంతి తర్వాత అధికారికంగా ప్రకటిస్తానని బాలయ్య చెప్పుకొచ్చాడు.
బాలకృష్ణ హీరోగా నటించిన ‘డిక్టేటర్’ చిత్రం సంక్రాంతి కానుకగా రేపు(జనవరి14) ప్రపంచ వ్యాప్తంగా, గ్రాండ్ గా విడుదల కానుంది. శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. బాలయ్య సరసన అంజలి, సొనాల్ చౌహన్ లు హీరోయిన్లుగా నటించారు. థమన్ సంగీతం అందించారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు బద్దలు కొట్టనుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more