Singam 3 First Look Posters

Singam 3 first look posters

Surya Singam 3 First Look, Singam 3 First Look, Singam 3 movie posters, Singam 3 movie updates, Singam 3 stills, Singam 3 Surya, Surya Movies, Shruti haasan latest news, Shruti haasan movie news, Shruti haasan movies, Shruti haasan latest stills, Shruti haasan stills

Singam 3 First Look Posters: Surya latest film Singham3 title confirmed. Anushka, Shruti haasan heroines. Hari Direction.

పాత పోస్టర్ కే కొత్త టైటిల్

Posted: 01/07/2016 10:20 AM IST
Singam 3 first look posters

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా ‘యముడు’, ‘సింగం’ చిత్రాలు తెలుగు, తమిళం భాషలలో ఎంతటి ఘనవిజయం సాధించాయో అందరికి తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీలోకి ‘సింగం’ పేరుతో రీమేక్ చేయగా, అక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలకు సీక్వెల్ గా ‘సింగం-3’ రూపొందుతుంది.

‘యముడు’, ‘సింగం’ చిత్రాల్లో సూర్యతో అందాల భామ అనుష్క జతకట్టింది. ఈ ‘సింగం-3’లో సూర్య భార్య పాత్రలో అనుష్క నటిస్తుండగా, శృతిహాసన్ పోలీస్ కాప్ పాత్రలో నటిస్తుంది. ఈ మూడవ సీక్వెల్ టైటిల్ విషయంలో గతకొద్దిరోజులవరకు చాలా పేర్లు వినిపించాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి ‘S-3’ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లు అంత కొత్తగా ఏం కనిపించడం లేదు.

గతంలో వచ్చిన ‘యముడు’, ‘సింగం’ చిత్రాల పోస్టర్లకు టైటిల్ డిజైన్ మార్చేసి విడుదల చేసినట్లుగా కనిపిస్తుంది. ఈ ‘సింగం-3’ పోస్టర్లు చూసినవాళ్లంతా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘సింగం’, ‘యముడు’ చిత్రాలకు దర్శకత్వం వహించిన హరి ఈ ‘సింగం-3’ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా తెలుగు, తమిళం భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya  Singam3  First Look  Posters  Anushka  Shruti Haasan  

Other Articles