Akhil never said i love you

Akhil never said i love you

Sayesha Saigal on Akhil, Sayesha Saigal, Akhil, Akhil Akkineni, Akhil Heroine, Sayesha Saigal in AKhil Cinema, Sayesha Saigal in Shivay, Akhil Movie

Akhil Akkineni never said i love you to his heroine Sayesha Saigal. She told to a media, that director did put any romantic scenes between them.

ఆమెకు ఐ లవ్ యూ చెప్పని అఖిల్

Posted: 12/28/2015 01:54 PM IST
Akhil never said i love you

నాగార్జున తనయుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మీద ఆ సినిమా హీరోయిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలే సినిమా ప్లాఫ్ కావడంతో తీవ్ర నిరాశలో ఉన్న అఖిల్ అండ్ టీంకు సయేషా కామెంట్లు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తున్నాయి. భారీ అంచనాలతో.. విపరీతమైన హైప్ తో విడుదలైన అఖిల్ సినిమా ‘అఖిల్’ బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టింది. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అఖిల్ కు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఇక తాజాగా అఖిల్ మీద, సినిమా మీద అయేషా కామెంట్లు మరింత ఇబ్బంది కలిగిస్తున్నాయి. అయితే సయేషా కామెంట్ల మీద అక్కినేని ఫ్యాన్స్, డైరెక్టర్ వివి వినాయక్ ఎలా స్పందిస్తారో చూడాలి.

అఖిల్ ఎంట్రీ అదిరింది... కానీ సినిమాను ప్లాఫ్ కాకుండా మాత్రం అక్కినేని చరిష్మా కాపాడలేకపోయింది. అయితే అఖిల్ తో పాటు నటించిన హీరోయిన్ సయేషా సైగల్ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో లీడ్ పెయిర్ అయినా తనకు, అఖిల్ కి మధ్య ఇంకొన్ని ఎమోషనల్ మరియు అర్థవంతమైన సన్నివేశాలను పెట్టి తమ ట్రాక్ ని ఇంకాస్త స్ట్రాంగ్ గా తీయాల్సిందని ముంబై ముద్దుగుమ్మ అభిప్రాయపడింది. ఈ సినిమాలో తమ ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ అనేవే ఉండవని.. ఒక్కసారి కూడా అఖిల్ ఐ లవ్ యు అని హీరోయిన్ కి చెప్పడని సయేషా తెలిపింది. అసలే సిపిమా పోయిందని బాధలో ఉంటే.. ఇలా తనతో కాసింతసేపు స్క్రీన్ ను అఖిల్ షేర్ చేసుకోవాల్సిందని.. అఖిల్ ఐ లవ్ యూ చెప్పలేదని అమ్మడు తన నోటికి వచ్చినట్లు మాట్లాడేసింది. ప్రస్తుతం అమ్మడు అజయ్ దేవగణ్ తో కలిసి శివాయ్ సినిమాలో నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sayesha Saigal  Akhil  VV Vinayak  

Other Articles