2015లో భారీ సక్సెస్లతో అలరించిన సల్మాన్ ఖాన్, ఈ ఏడాది మరో మెమరబుల్ మార్క్ను రీచ్ అయ్యాడు. ఇవాళ ఆయన తన 50వ పడిలో అడుగుపెట్టాడు. ఇప్పటికీ బాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్గా ఉన్న సల్లూ భాయ్, గోల్డెన్ జూబ్లీ బర్తే డే సెలబ్రేషన్స్ను అభిమానులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇప్పటికే ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ వెబ్ సైట్లలో సల్మాన్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ పోస్ట్లు వెళ్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు బీటౌన్ సెలబ్రిటీలు కూడా సల్మాన్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇప్పటి వరకు సల్మాన్ పాల్గొనే పుట్టిన రోజుక వేడుకలపై ఎలాంటి సమాచారం లేకపోవటంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం సుల్తాన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సల్మాన్, ఈ సారి తన పుట్టిన రోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవటం లేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి కొంత మంది సల్మాన్ పుట్టిన రోజును బిగ్బాస్ 9 సెట్లో చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా చెబుతున్నారు. సల్మాన్ టీం నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం లేదు.
ఈ సారి సల్మాన్ జరుపుకుంటున్న పుట్టినరోజుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. చాలా రోజులుగా సల్మాన్ ను ఇబ్బంది పెడుతున్న కోర్ట్ కేసుల నుంచి కండలవీరుడికి విముక్తి లభించటంతో పాటు సల్మాన్ జీవితకథ బీయింగ్ హ్యూమన్ పేరుతో పుస్తక రూపంలో రిలీజ్ అవుతోంది. కాగా 50 వ జన్మదిన వేడుకలు చేసుకుంటున్నా.. 27వ ఏట ఉన్నట్టుందని సల్మాన్ ఖాన్ అన్నాడు. 'నేను 27 ఏళ్ల వయసులో ఉన్నట్టుంది. నా దృష్టిలో ఈ వయస్సు సరైనది. నాకెంతో ఇష్టం. నేను ఎప్పుడూ వయసు గురించి భయపడను. నేనెప్పుడూ 27లో ఉన్నట్టు భావిస్తాను కాబట్టి వయసు మీద పడుతోందని ఆందోళన చెందను. నా ప్రయాణంలో ఇదో భాగం' అని సల్మాన్ చెప్పాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more
Aug 04 | నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఇటు హీరోగా అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు సత్యదేవ్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు... Read more