Valli Movie First Look

Valli movie first look

Valli First Look, Valli Movie First Look, Vijayendra prasad Valli movie stills, Vijayendra prasad Valli First Look, Vijayendra prasad Valli news, Vijayendra prasad Valli Movie, Vijayendra prasad movies, Vijayendra prasad movies updates, Vijayendra prasad

Valli Movie First Look: Tollywood film writer and director Vijayendra prasad latest film Valli. This film first look poster launched.

‘వల్లీ’ ఫస్ట్ లుక్: కథ మొత్తం చెప్పేసిన విజయేంద్రప్రసాద్

Posted: 12/18/2015 12:58 PM IST
Valli movie first look

ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ తాను తీయబోయే సినిమా కథ మొత్తం ముందే చెప్పేసాడు. ‘బాహుబలి’, ‘భజరంగీ భైజాన్’ వంటి హిట్ చిత్రాలకు రచయితగా పనిచేసిన విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వల్లీ’. రేష్మాస్ ఆర్ట్స్ సంస్థ బ్యానర్ పై నేహ హింగే, రజత్ కృష్ణ, అర్హాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ బృందావన్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను తాజాగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ... మానవాళి అభివృద్ధి కోసం మనిషి మనసుని పరిశోధించే యంత్రాన్ని కనుగొనే ప్రయత్నాలలో ఉన్న ఒక ప్రొఫెసర్(అశోక్ మల్హోత్ర). భారతదేశంలో వైజ్ఞానిక పరిశోధనలకు డబ్బు అడ్డంకి కాకుండదని తన యావదాస్థిని దానం చేసే ఒక సైంటిస్ట్ (రామచంద్ర). ఆయన కూతురికి తన ఆశయాన్ని, ప్రొఫెసర్ అశోక్ స్టూడెంట్ గా అతని లక్ష్యాన్ని అందుకునే ప్రయత్నాలలో వున్న హీరోయిన్ (వల్లి). అలాంటి అమ్మాయిని ప్రేమించి ఆరాధించి, ఆమె కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా, తియ్యడానికైనా సిద్ధమయ్యే చిన్ననాటి స్నేహితునిగా (రజత్ కృష్ణ). వెయ్యి సంవత్సరాలుగా తన ప్రేయసి కోసం ఎదురుచూస్తున్న మజ్ను పాత్రలో (అర్హాన్) నటించారు. బ్రెయిన్ వేవ్ ఎక్స్ పెరిమెంట్ లో పాల్గొనడం వల్ల వల్లికి గత జన్మస్మృతులు గుర్తుకువచ్చి, పూర్వజన్మలో ఆమె లైలా అన్న విషయం తెలుస్తుంది. వేయి సంవత్సరాలుగా ఎదురుచూసి వెదుక్కుంటూ వచ్చిన ప్రియుడు మజ్ను, తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్నేహితుడు.. వీరిద్దరి మధ్య సతమతమవుతున్న వల్లీకి, ఆండ్రియా అనే లెస్బియన్ రూపంలో మరో సమస్య ఎదురవుతుంది. ఇవి కాకుండా ఇంకా ఎన్నో విచిత్రమైన సమస్యలు, విపత్కర పరిస్థితులు వల్లిని చుట్టుముడతాయి. ఈ సమస్యలన్నింటినీ వల్లి ఏ విధంగా అధిగమించింది. వాటి నుండి తన ప్రాణాలు ఏ విధంగా కాపాడుకుంది. తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకుంది? అనేదే ఈ చిత్ర కథ అని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijayendra prasad  Valli  First Look  poster  stills  

Other Articles