గోపిచంద్, రెజీనా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సౌఖ్యం’. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఆదివారం ఒంగోలులో, ప్రేక్షకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. బిగ్ సీడి, ఆడియో సిడీలను హీరో గోపిచంద్ విడుదల చేసారు.
ఇదే వేడుకపై హీరోయిన్ రెజీనా పుట్టినరోజు వేడుకను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాతలతో పాటు గోపిచంద్, రెజీనా, అనూప్, ఆర్.నారాయణ మూర్తి, శంకర్ మాస్టర్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారంతా కూడా సినిమా మంచి ఘన విజయం సాధించాలని కోరారు. ఒంగోలులో ఆడియో వేడుక చేయాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. సౌఖ్యం సినిమాతో ఆ కోరిక నెరవేరింది. ఇందుకు ఆనంద్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని గోపిచంద్ చెప్పుకొచ్చారు.
భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో షావుకారు జానకి, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్ రెడ్డి, జీవా, రఘుబాబు, కృష్ణభగవాన్, ముఖేష్ రుషి, దేవా, పృథ్వి, రఘు, శివాజీరాజా, సురేఖావాణి, సత్యకృష్ణ, సత్యం రాజేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కథ, మాటలు; శ్రీధర్ సీపాన, సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్ : వివేక్, నిర్మాత: వి.ఆనంద్ప్రసాద్.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more