Ram Nenu Shailaja Movie First Look Poster

Ram nenu shailaja movie first look poster

Ram Nenu Shailaja First Look Release, Ram Nenu Shailaja First Look, Nenu Shailaja First Look, Ram Nenu Shailaja Posters, Ram latest stills, Nenu Shailaja Movie Posters, Nenu Shailaja

Ram Nenu Shailaja Movie First Look Poster: tollywood hero ram latest film Nenu Shailaja. Kishore tirumala direction. keerthi suresh heroine.

రామ్ ‘నేను శైలజ’ ఫస్ట్ లుక్ విడుదల

Posted: 12/05/2015 04:25 PM IST
Ram nenu shailaja movie first look poster

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్నాడు. రామ్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుండటంతో తన తరువాతీ చిత్రాలను పక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం రామ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు.

ఇందులో రామ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది. అయితే ఈ చిత్రానికి ముందుగా ‘హరికథ’ అనే టైటిల్ అనుకున్నారు. కానీ తాజాగా ఈ చిత్రానికి ‘నేను శైలజ’ అనే టైటిల్ ఖరారు చేసారు. ‘నేను శైలజ’ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసారు.

ఇందులో రామ్, కీర్తిలు చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు. రొమాంటిక్ లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఆడియో విడుదల చేసి, వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram  Nenu Shailaja  First Look  Posters  Stills  

Other Articles