Priyanka Chopra talks about MadamJi film

Priyanka chopra talks about madamji film

Priyanka Chopra Clarifies on MadamJi, Priyanka Chopra talks about MadamJi, Priyanka Chopra latest news, Priyanka Chopra movies, Priyanka Chopra latest stills, Priyanka Chopra hot stills, Priyanka Chopra

Priyanka Chopra talks about MadamJi film: Bollywood star heroine latest film Bajirao Mastani. Madhur Bhandarkar said his ambitious venture "Madamji" with Priyanka Chopra, saying the film will definitely be made.

భయం లేదు కానీ... ‘మేడమ్ జీ’ రావడం పక్కా: ప్రియాంక చోప్రా

Posted: 12/05/2015 10:32 AM IST
Priyanka chopra talks about madamji film

హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ప్రియాంక చోప్రా... తనకు ఆ విషయంలో ఎలాంటి భయం లేదని చెబుతోంది. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే.... ఇప్పటికే చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ప్రియాంకచోప్రా గతకొద్ది కాలంగా నిర్మాణ రంగంలోకి అడుగెట్టి నిర్మాతగా మారాలని భావించింది. అందులో భాగంగా ‘మేడమ్ జీ’ అనే పేరుతో ఓ సినిమాను కూడా అనౌన్స్ చేసింది.

కానీ సినిమా టైటిల్ ప్రకటించిన తర్వాత ఆ ప్రాజెక్ట్ అటకెక్కేసింది. దీంతో నిర్మాతగా కోట్లు పెట్టి సినిమా తీయడానికి ప్రియాంకచోప్రా భయపడుతుందేమోనని అందరూ అనుకుంటున్నారు. ఈ విషయంపై ప్రియాంక చోప్రా స్పందిస్తూ.. నాకు ఎలాంటి భయంలేదు. ప్రస్తుతం చేస్తున్న మరియు ఒప్పుకున్న సినిమాలతో బిజీగా వుండటం వలన ‘మేడమ్ జీ’ చిత్రం ప్రారంభించలేకపోయాను. కానీ ఖచ్చితంగా ఈ సినిమా నిర్మిస్తాను. స్టార్ హీరోలతోనే కాకుండా కొత్త వారితో కూడా సినిమాలు తీయాలనుకుంటున్నాను అని తెలిపారు.

నిర్మాతగానే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతారా అనే ప్రశ్నకు ప్రియాంక సమాధానమిస్తూ... డైరెక్షన్ అంతా ఈజీ కాదు. ఇపుడు నేనున్న బిజీలో దాని గురించి ఆలోచించడమే లేదు. కంటి నిండా నిద్ర పోవడానికి కూడా సమయం దొరకడం లేదు. భవిష్యత్తులో ఎపుడైనా టైం వుంటే డైరెక్షన్ గురించి ఆలోచిస్తాను తప్ప.. ఇప్పుడు మాత్రం డైరెక్షన్ చేసే ఛాన్స్ లేదు అని తేల్చేసింది.

ప్రియాంక చోప్రా నటించిన తాజా చిత్రం ‘బాజీరావ్ మస్తా’ ఈనెల 18న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళం భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది. రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే కలిసి నటించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. మరి ఈ సినిమా ప్రియాంకకు ఎలాంటి విజయాన్ని అందించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  MadamJi  Bajirao Mastani  hot stills  

Other Articles