Allu Arjun Sarainodu ceded rights sold out

Allu arjun sarainodu ceded rights sold out

Allu Arjun Sarainodu movie ceded rights sold, Allu Arjun Sarainodu ceded rights, Allu Arjun Sarainodu movie stills, Allu Arjun latest news, Allu Arjun movie updates, Allu Arjun movie details, Allu Arjun

Allu Arjun Sarainodu ceded rights sold out: Stylish star allu arjun latest film sarainodu. boyapati srinu director, Rakul preet singh heroine.

సీడెడ్ లో భారీ రేటుకు ‘సరైనోడు’ అమ్మకం

Posted: 12/04/2015 10:20 AM IST
Allu arjun sarainodu ceded rights sold out

‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘రుద్రమదేవి’ చిత్రాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరైనోడు’(వర్కింగ్ టైటిల్). ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ప్రముఖ కమర్షియల్ మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్ వంటివి ఏం విడుదల కాకముందే బిజినెస్ మొదలయ్యింది. తాజాగా ‘సరైనోడు’ చిత్ర సీడెడ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి ఎన్వీ ప్రసాద్ సుమారు 9 కోట్లు పెట్టి ఈ చిత్ర సీడెడ్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

గతంలో బన్నీ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్ర సీడెడ్ హక్కులను 7 కోట్లకు అమ్మారు. కమర్షియల్ మాస్ చిత్రాల దర్శకుడిగా బోయపాటి శ్రీనుకు మంచి డిమాండ్ వుండటంతో సీడెడ్ లో భారీ హిట్టవుతుందనే నమ్మకంతో ‘సరైనోడు’ రైట్స్ ను భారీ రేటుకు అమ్మేసినట్లుగా తెలిసింది. మిగతా ఏరియాల నుంచి ఇదే విధమైన డిమాండ్ వున్నట్లుగా తెలుస్తోంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రకూల్ ప్రీత్ సింగ్, కెథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీకాంత్, ఆదిపినిశెట్టిలు కీలక పాత్రలలో నటిస్తున్నారు. థమన్ సంగీత అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Sarainodu  ceded rights  stills  Rakul preet singh  

Other Articles