Shah Rukh Khan | Proposes | Rekha

Shah rukh khan proposes rekha once again

Shah Rukh Khan Proposes Rekha Again, Shah Rukh Khan wants Rekha Again, Shah Rukh Khan Proposes Rekha, sharukh khan Marriage proposal to Rekha, sharukh khan proposal to Rekha, Shah Rukh Khan Flirts to Rekha, filmfare glamour and style awards 2015

Shah Rukh Khan Proposes Rekha once again: sharukh khan Marriage proposal to Rekha in filmfare glamour and style awards 2015. The big moment was when Rekha presented an award to Shah Rukh Khan.

కత్తిలాంటి ఆంటీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న షారుక్

Posted: 12/03/2015 10:37 AM IST
Shah rukh khan proposes rekha once again

బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ ఎవరు అంటే అందరూ ముక్తకంఠంతో ‘రేఖ’ అనే సమాధానమిస్తారు. వయసు పెరుగుతున్నా కూడా వన్నె తరగని అందం ఆమెది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఇప్పటికీ కూడా రేఖను అందాల తారతోనే పోల్చుతుంటారు. అలాంటి రేఖ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా అలాగే వుండిపోయింది. అయితే రేఖను పెళ్లి చేసుకోవడానికి బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సిద్ధంగా వున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా షారుక్ బహిరంగంగా చెప్పుకొచ్చాడు.

ఇటీవలే ‘ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్’ వేడుక జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు పలువురు అతిరథ మహారధులు విచ్చేసారు. ఈ వేడుకలో షారుక్ కు అవార్డు ఇవ్వడానికి రేఖను వేదికపైకి ఆహ్వానించారు. గతంలో చాలాసార్లు రేఖ చేతుల మీదుగా ‘మోస్ట్ గ్లామరస్ స్టార్’గా షారుక్ అవార్డును అందుకున్నాడు. ఈ సంధర్భంగా రేఖకు తాను చేసిన పెళ్లి ప్రపోజల్ గురించి షారుక్ చెప్పుకొచ్చాడు.

కొన్నేళ్ల క్రితం ముంబయ్‌లోని మెహబూబ్ స్టూడియోస్‌లో జరిగిన ఓ అవార్డ్ నైట్‌ షోలో రేఖకు షారుఖ్ తన ప్రేమ, పెళ్ళి ప్రపోజల్ గురించి చెప్పారట. అప్పటి నుంచి రేఖ చెప్పే సమాధానం కోసం షారుఖ్ ఇంకా ఎదురుచూస్తునే వున్నాడట. ఈ ‘ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్’ వేడుకలో రేఖ చేతుల మీదుగా అవార్డును అందుకున్న షారుక్ మాట్లాడుతూ... రేఖాజీ చేతి నుంచి అవార్డు అందుకున్న ప్రతిసారీ.. ఈసారైనా ఆమె నన్ను పెళ్ళి చేసుకుంటారేమోనని ఆశిస్తూ ఉంటాను అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు.

వెంటనే రేఖ ఈ విషయంపై చిలిపిగా స్పందిస్తూ.. ‘ఈ విషయం నేను గౌరి (షారుఖ్ భార్య)తో మాట్లాడాలి’ అంటూ సమాధానమిచ్చారు. రేఖ మాటలకు షారుఖ్ వెంటనే... ‘అవును. ఎవరు ఏ బెడ్‌రూమ్ తీసుకోవాలో మీరిద్దరూ మాట్లాడుకొని, నిర్ణయించుకోవాల్సిందే’ అంటూ రొమాంటిక్ గా సమాధానమిచ్చాడు. మొత్తానికి రేఖను పెళ్లి చేసుకోవాలనుందంటూ షారుఖ్ బహిరంగంగానే ప్రపోజ్ చేసేసి హాట్ టాపిక్ గా మారాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh Khan  Proposes  Rekha  filmfare glamour and style awards 2015  stills  

Other Articles