Ravi Teja | Dil Raju | Yevado Okadu | Devisriprasad

Devi sri prasad music starts for raviteja yevado okadu

DSP Music starts for Ravi Teja Yevado Okadu Movie, Ravi Teja Next Film Yevado Okadu, Ravi Teja Yevado Okadu, Ravi Teja movie news, Ravi Teja movie updates, Ravi Teja stills, Ravi Teja movie updates, Ravi Teja details, Ravi Teja

Devi Sri Prasad Music starts for Raviteja Yevado Okadu: Mass Maharaja upcoming film Yevado Okadu. producer dil raju. Venu sriram direction. Devisriprasad music.

‘ఎవడో ఒకడు’ కోసం దేవి స్టైలిష్ ఆల్బం

Posted: 12/02/2015 01:48 PM IST
Devi sri prasad music starts for raviteja yevado okadu

‘వెంకీ’, ‘భద్ర’, ‘సారొస్తారు’ వంటి మ్యూజికల్ హిట్ చిత్రాల తర్వాత మాస్ మహారాజ రవితేజ, రాకింగ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కలయికలో వస్తున్న తాజా చిత్రం ‘ఎవడో ఒకడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా కోసం దేవి మ్యూజిక్ కంపోజిషన్ ప్రారంభించేసాడు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాల పాటల ఆల్బంల కంటే అద్భుతంగా ఈ ‘ఎవడో ఒకడు’ ఆడియో ఆల్బంను అందించడానికి దేవి ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది.

ఈ సినిమాలో రవితేజ ఓ డిఫరెంట్ స్టైల్ లో కనిపించనున్నాడు. అలాగే రవితేజ స్టైలిష్ కమర్షియల్ లుక్స్ తో, తన పాత్రతో అలరించనున్నాడని తెలిసింది. అందుకే దేవి కూడా ఈ చిత్ర పాటలను కూడా చాలా స్టైలిష్ అండ్ మాస్ తరహాలో వుండేట్లుగా కంపోజ్ చేస్తున్నట్లుగా తెలిసింది.

ఇందులో రవితేజ సరసన ‘కంచె’ ఫేం ప్రగ్యా జైస్వాల్, మలయాళం ‘ప్రేమమ్’ ఫేం అనుపమ పరమేశ్వరన్ లు హీరోయిన్లుగా నటించనున్నారు. కమర్షియల్ ఫ్యామిలీ, లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం రవితేజ నటించిన ‘బెంగాల్ టైగర్’ చిత్రం ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ఎవడో ఒకడు’ చిత్రంలో రవితేజ, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, నాసర్, రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించనున్నారు. కెమెరా: రిచర్డ్ ప్రసాద్; సంగీతం: దేవిశ్రీప్రసాద్; డైలాగ్స్: రమేష్ గోపి; ఎడిటర్ - శ్రీను; కో ప్రొడ్యూసర్స్ - శిరీష్, లక్ష్మణ్; నిర్మాత: దిల్ రాజు; కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వేణు శ్రీరామ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja  Dil Raju  Yevado Okadu  Devisriprasad  Bengal Tiger  stills  

Other Articles