tollywood heroines responds on Paris issue

Tollywood heroines responds on paris issue

Indian actress responds on Paris issue, Trisha responds on Paris issue, Priyanka Chopra responds on Paris issue, Anushka sharma responds on Paris issue, Ileana responds on Paris issue, priyanka chopra, Anushka sharma, Ileana, trisha tweets

tollywood heroines responds on Paris issue: Bollywood and tollywood actress priyanka chopra, Anushka sharma, Ileana, trisha tweets about paris issue.

ప్యారిస్ ఘటనపై హీరోయిన్ల హార్ట్ బ్రేక్

Posted: 11/14/2015 09:51 AM IST
Tollywood heroines responds on paris issue

ఉదయం లేస్తూనే ఎవరైనా శుభవార్త వినాలని కోరుకుంటారు. మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం జరగకూడదని కోరుకుంటారు. అది తన విషయంలోనైనా సరే ఎదుటివారి విషయంలోనైనా సరే. కానీ ఈరోజు ఉదయం జరిగిన సంఘటన వల్ల దేశం మొత్తం తీవ్ర దిగ్ర్బాంతికి గురయ్యింది.

ప్యారిస్ లో ఈరోజు తెల్లవారు జామున ఉగ్రవాదులు దాడి చేసారు. ఈ వార్త తెలియగానే సినీ ఇండస్ట్రీ తారలు ఈ ఘటనపై తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వారి ఆవేదనను వ్యక్తం చేసారు. అనుష్క శర్మ, ఇలియానా, త్రిష, ప్రియాంక చోప్రా తదితరులు స్పందించారు.

ఈ ఘటనపై హీరోయిన్ త్రిష తన ఆవేదన మాటల్లో వ్యక్తం చేయకుండా గుండె పగిలిపోయిన సింబల్ పెట్టింది. ఇక ఇలియానా ఇంత దారుణమైన వార్త ప్యారిస్ గురించి! ఆ కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. అసలు ఈ జనం ఏం కావాలనుకుంటున్నారు. అంటూ పోస్ట్ చేసింది.

ప్రియాంక చోప్రా... ప్యారిస్ లో జరిగిన విషయం తెలిసి చాలా డిస్టర్బ్ అయ్యాను. అసలు ఈ ప్రపంచానికి ఏమైపోతుంది. ఈ హింసకాండ జరగాల్సిన అవసరం ఏముంది. ప్రే ఫర్ ప్యారిస్. నా హృదయం గాయపడింది అంటూ పోస్ట్ చేసింది.

అనుష్క శర్మ.... ఉదయం లేస్తూనే ప్యారిస్ లో దాడుల గురించి దారుణమైన విషయం తెలిసింది. ఈ పిరికిపందల దాడులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు ప్యారిస్ ప్రజలకు మరింత ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అంటూ పోస్ట్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : priyanka chopra  Anushka sharma  Ileana  trisha  tweets  Paris issue  

Other Articles