Kondavalasa Lakshmana Rao | funeral | Passes away

Comedian kondavalasa lakshman rao funeral completed

Comedian kondavalasa lakshman rao funeral, Kondavalasa Lakshmana Rao passes away, Kondavalasa Lakshmana Rao died, Kondavalasa Lakshmana Rao death, Kondavalasa Lakshmana Rao no more, Kondavalasa Lakshmana Rao death news, Kondavalasa Lakshmana Rao news, Kondavalasa Lakshmana Rao movies, Kondavalasa Lakshmana Rao stills, Kondavalasa Lakshmana Rao photos, Kondavalasa Lakshmana Rao

Comedian kondavalasa lakshman rao funeral completed: Tollywood comedian Kondavalasa Lakshmana Rao Passes away. Comedian Kondavalasa Lakshmana Rao latest news, movies, gossips, stills, death stills, songs, videos

నటుడు కొండవలస అంత్యక్రియలు పూర్తి

Posted: 11/05/2015 03:39 PM IST
Comedian kondavalasa lakshman rao funeral completed

ప్రముఖ సినీ నటుడు కొండవలస లక్ష్మణరావు సోమవారం రాత్రి 9 గంటల సమయంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే కొండవలస అంత్యక్రియలు నేడు ఎర్రగడ్డ శ్మాశనవాటికలో పూర్తయ్యాయి. అమెరికాలో వుండే కొండవలస కూతురు రావడం కాస్త ఆలస్యం కావడంతో కొండవలస లక్ష్మణరావు భౌతికఖాయాన్ని నిమ్స్ మార్చరిలో వుంచారు.

ఈరోజు ఉదయం అన్ని కార్యక్రమాలు పూర్తి, కొండవలస భౌతిక ఖాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. చెవికి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ, చికిత్స పొందుతూ కొండవలస తన తుదిశ్వాస విడిచారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన సినీ నటీనటులు, తోటి కళాకారులు ఆయనను కడసారిగా చూసుకున్నారు. దర్శకులు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసారు. ఈ సినిమాలో కొండవలస చెప్పిన ‘నేనొప్పుకోను... అయితే ఓకే’ అనే డైలాగ్ తో భారీగా పాపులర్ అయ్యారు.

ఈ ఒక్క సినిమాతో భారీగా పాపులర్ అయిన కొండవలస.. ఆ తర్వాత వరుస అవకాశాలను దక్కించుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించి, ప్రేక్షకులను రంజింపచేసారు. అలాగే నాటకరంగంలో వెయ్యికి పైగా నాటకాలు వేసారు. ఈయన దాదాపు 380 అవార్డులతో పాటుగా రెండు నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kondavalasa Lakshmana Rao  funeral  Passes away  died  stills  

Other Articles