mahesh babu to debut in bollywood with murugadoss high budget movie which is to be start from april | mahesh babu bollywood entry

Mahesh babu to debut in bollywood with murugadoss high budget movie

mahesh babu news, mahesh babu murugadoss movie, mahesh babu bollywood offers, mahesh babu controversy, bramhotsavam movie updates, srimanthudu movie updates

mahesh babu to debut in bollywood with murugadoss high budget movie : mahesh babu to debut in bollywood with murugadoss high budget movie which is to be start from april.

బాలీవుడ్ తెరపై సత్తా చాటనున్న మహేష్

Posted: 11/04/2015 01:08 PM IST
Mahesh babu to debut in bollywood with murugadoss high budget movie

అవును! నిన్నటిదాకా బాలీవుడ్ ఆఫర్స్ వరుసగా ఎన్ని వచ్చినా వాటిని తిరస్కరించిన ప్రిన్స్ మహేష్ బుబు.. ఇప్పుడు ఆ చిత్రాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేయించుకున్న ఈ హీరో.. ప్రస్తుతం తన మార్కెట్ పరిధిని మరింత విస్తరింపచేసుకునే పనిలో పడ్డాడు. అన్నట్టు.. మహేష్ బాబుకు బాలీవుడ్ లో కూడా చాలామందే ఫ్యాన్స్ వున్నారు. నిజానికి.. మహేష్ ఏ ఒక్క హిందీ సినిమా చేయనప్పటికీ.. తన స్టైల్, మేనరిజంతో అక్కడ కూడా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఇదంతా ఇతని డబ్బింగ్ సినిమాల మహిమే! తెలుగులో భారీ హిట్ అయిన మహేష్ సినిమాలు.. బాలీవుడ్ లో డబ్బింగ్ అవుతున్న విషయం విదితమే! ఆ విధంగా తనికి ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో ఈ హీరో ఇప్పుడు నేరుగా హిందీ వెండితెరపై ఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు.

ప్రస్తుతం మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఘనవిజయం సాదించటంతో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని భావిస్తున్నారు. దీంతోపాటు శ్రీమంతుడు సినిమా ఇచ్చిన కిక్తో బ్రహ్మోత్సవాన్ని కూడా తెలుగుతోపాటు తమిళ్లోనూ తెరకెక్కిస్తున్న ప్రిన్స్, మలయాళంలోనూ డబ్బింగ్ వర్షన్ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ విధంగా సౌత్ ఇండస్ట్రీలో తన మార్కెట్ పరిధిని పెంచుకుంటున్న ఈ రాజకుమారుడు.. త్వరలోనే నార్త్లోనూ అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. బ్రహ్మోత్సవం సినిమా తరువాత తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు మహేష్. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈసినిమాను తెలుగు, తమిళ్తోపాటు హిందీలోనూ ఒకేసారి తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. మురుగదాస్ ఇప్పటికే పలు హిట్ సినిమాలను తెరకెక్కించి అక్కడ స్టార్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నాడు. ఇక మహేష్ కీ అక్కడ ఫాలోయింగ్ బాగానే వుంది కాబట్టి.. వీరి కాంబోలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రాన్ని హిందీలోనూ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సోషల్ మెసేజ్తో భారీగా తెరకెక్కుతున్న మహేష్, మురుగదాస్ల సినిమాను ఎన్ వి ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాను ఏప్రిల్ 12న ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతోపాటు నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక చేస్తున్నారు చిత్రయూనిట్. మరి.. మహేష్ బాలీవుడ్ ఎంట్రీ అక్కడి హీరోలకు ఇబ్బందిగా మారుతుందా..? లేదా..? అనే విషయం తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu murugadoss movie  bramhotsavam movie updates  

Other Articles