Venkatesh | Maruthi | Nayanthara

Venkatesh nayanthara next film launch on december

Venkatesh Maruthi film launch on december, Venkatesh Maruthi film details, Venkatesh movie news, Venkatesh movie updates, Venkatesh movie stills, Venkatesh news, Venkatesh stills, Venkatesh

Venkatesh Nayanthara next film launch on december: Victory Venkatesh upcoming film with director Maruthi. Maruthi recent block buster hit film Bhale Bhale Magadivoy.

డిసెంబర్లో వెంకీ-నయనతారల సినిమా

Posted: 10/30/2015 11:19 AM IST
Venkatesh nayanthara next film launch on december

‘గోపాల గోపాల’ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లలేదు. కానీ దాదాపు 10 నెలలు గ్యాప్ తీసుకొని మళ్లీ వెంకటేష్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవలే ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో దర్శకుడిగా మంచి హిట్ ను సొంతం చేసుకున్న మారుతి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది.

గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘రాధా’ అనే చిత్రం లాంఛనంగా ప్రారంభమై కొన్ని అనివార్య కారణాల వలన ఆగిపోయింది. అయితే వెంకటేష్ మెచ్చే విధంగా మరో కొత్త కథను రెడీ చేసి ఇటీవలే వెంకీతో గ్రీన్ సిగ్నల్ దక్కించుకున్నాడు మారుతి. వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పూర్తికథను సిద్ధం చేసే పనిలో పడ్డాడు మారుతి.

ఈ సినిమాలో వెంకటేష్ సరసన నయనతార హీరోయిన్ గా నటించనుంది. గతంలో వెంకటేష్-నయనతార జంటగా నటించిన ‘తులసి,’, ‘లక్ష్మీ’ వంటి చిత్రాలు భారీ విజయం సాధించాయి. మరి ముచ్చటగా మూడోసారి జతకట్టనున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkatesh  Maruthi  Nayanthara  Movie news  stills  

Other Articles