tamanna bhatia got huge offer to act as heroine in kamal hassan movie | kollywood gossips | tamil movie updates

Tamanna bhatia got huge offer kamal hassan kollywood updates

tamanna news, tamanna bhatia, tamanna latest updates, tamanna hot photo shoot, tamanna milky body, kamal hassan, kollywood news

tamanna bhatia got huge offer kamal hassan kollywood updates : tamanna bhatia got huge offer to act as heroine in kamal hassan movie.

భలే ఛాన్స్ కొట్టేసిన మిల్కీ బ్యూటీ

Posted: 10/26/2015 12:34 PM IST
Tamanna bhatia got huge offer kamal hassan kollywood updates

తక్కువ వయస్సులోనే ముఖానికి మేకప్ వేసుకుని ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మిల్కీబ్యూటీ తమన్నా.. తన కెరీర్ ని బాగానే బిల్డ్ చేసుకుంది. మొదటి నుంచి ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ మంచి పాత్రలుగల సినిమాలు ఒప్పుకుంటూ వరుస విజయాలు సాధిస్తూ స్టార్ స్టేటస్ ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఈమెను వరుస పరాజయాలు వెంటాడాయి. స్టార్ హీరోయిన్ స్థాయి నుంచి ఈ ఫ్లాపులు ఈమెను కిందకు దిగజార్చాయి. అప్పుడే ‘బాహుబలి’ ఈమెను ఆదుకుని.. దేశవ్యాప్తంగా ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టాడు. ఆ సినిమా ఈమె కెరీర్ మలుపు తిప్పేసి.. ఓ ప్రత్యేక స్థానాన్ని అందించింది. దీంతో ఈమెకు మళ్లీ భారీ అవకాశాలు వరిస్తున్నాయి.

ఇప్పటికే నాగార్జున-కార్తీ మల్టీస్టారర్ ‘ఊపిరి’, రవితేజ సరసన ‘బెంగాల్ టైగర్’ సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడికి.. మరో అనుకోని వరం వరించింది. అదే సౌత్ ఇండియన్ లెజండ్రీ హీరో సరసన నటించే అవకాశం కొట్టేయడం. అతనెవరో కాదు ఉలగనాయగన్ అలియాస్ యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. సీనియర్ డైరెక్టర్ మౌళి రాసిన కథతో కమల్ హాసన్ తన తదుపరి సినిమాని చేయనున్నాడు. ఈ సినిమాలో కమల్ కి జోడీగా తమన్నాని అనుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబందించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే క్లారిటీ రానున్న ఈ సినిమాకి కూడా ‘చీకటి రాజ్యం’ ఫేం రాజేష్ ఎం సెల్వ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఈమె నటిస్తున్న ‘బెంగాల్ టైగర్’ నవంబర్ లో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. అలాగే నాగార్జున – కార్తీలతో కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ సినిమా చివరి దశలో ఉంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamanna bhatia  kamal hassan  kollywood news  

Other Articles