Deva Kattas next film name as Mahaprasthanam

Deva kattas next film name as mahaprasthanam

Mahaprasthanam, Prasthyanam, Devakatta, Devakatta films, Director Devakatta, Autonagar Surya, Dynamite

After Prasthanam cinema, Director Deva Katta didnt get hit. Autonagar Surya and Dynamite Devakatta, showing his dicrection capacity by the film Mahaprasthanam.

ప్లాఫ్ ల తర్వాత వస్తున్న దేవాకట్టా మహాప్రస్థానం

Posted: 10/24/2015 10:21 AM IST
Deva kattas next film name as mahaprasthanam

ప్రస్థానం సినిమాతో తన డెరెక్షన్ కెపాసిటిని తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ దేవాకట్టా. ప్రస్థానం తెచ్చిన గుర్తింపు... ప్రశంసలు అన్నీ ఇన్నీ కాదు. కానీ ప్రస్థానం లాంటి లెజండరీ సినిమా తర్వాత తెరకెక్కిన దేవాకట్టా సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఆటోనగర్ సూర్య, డైనమైట్  సినిమాలు నిరాశపరిచాయి. కానీ తాజాగా మరోసారి తన టాలెంట్ ను చూపించడానికి సిద్దమయ్యారు దేవాకట్టా. అందులో బాగంగా తన తాజా చిత్రం మహాప్రస్థానం సినిమా విలన్ నేపథ్యంలో సాగే టీజర్ ను విడుదల చేశారు. గతంలో ఆటోనగర్ సూర్య సినిమా రావడానికి ముందు ఆటోనగర్ సూర్య పేరుతో ఓ టీజర్ ను విడుదల చేశారు. అవును.. నేను అనాధను కానీ అనామకుడిని కాదు అన్న డైలాగ్ తో వచ్చిన టీజర్ చాలా పాపులర్ అయింది. అదే తరహాలో మహాప్రస్థానం కూడా టీజర్ విడుదలైంది.

కరెన్సీ.. అన్నింటికి మూలకారణమైన కరెన్సీ వెంట పరిగెత్తాను.. ఏడు సంవత్సరాల వయస్సులో నిజాన్ని తెలుసుకొని.. కరెన్సీ వెంట పరుగెత్తుతున్నానని విలన్ వాయిస్ తో తాజాగా మహాప్రస్థానం టీజర్ విడుదలైంది. ఐ యామ్ కరప్ట్.. క్రిమినల్ .. అండ్ ఐ యామ్ ది విలన్ అంటూ సాగే ఈ టీజర్ కూడా విలన్ ను హైలెట్ చేస్తూ సాగింది. దేవాకట్టా ప్రస్థానం సినిమా తర్వాత ఆటోనగర్ సూర్య లాంటి డిజాస్టర్ తీవ్ర నిరాశపరిచింది. మొన్నీ మధ్యన వచ్చిన డైనమైట్ కూడా దేవాకట్టా గ్రాఫ్ ను కిందికి నెట్టింది. దాంతో ప్రస్తుతం దేవాకట్టాకు మహాప్రస్థానం ఖచ్చితంగా హిట్ ఇవ్వాల్సి ఉంది. లేదంటే ఇప్పటికే ఛాన్స్ లు రాక వెనకబడిపోయిన దేవాకు పెద్ద దెబ్బ పడుతుంది. మరి చూడాలి మహాప్రస్థానంతో దేవాకట్టా కొత్త ప్రస్థానాన్ని ప్రారంభిస్తారేమో.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles