nannaku prematho movie unit is ready to shift spain for next schedule | junior ntr news | director sukumar updates

Nannaku prematho movie unit ready to shift spain for next schedule

nannaku prematho movie unite, nannaku prematho movie news, nannaku prematho movie updates, nannaku prematho schedules, junior ntr news, director sukumar news, sukumar controversies, sukumar movies, rakul preet singh, rakul preet singh updates

nannaku prematho movie unit ready to shift spain for next schedule : nannaku prematho movie unit is ready to shift spain for next schedule for 30 days shooting.

‘నాన్న’ కోసం స్పెయిన్ కి వెళ్లనున్న ఎన్టీఆర్

Posted: 10/23/2015 04:58 PM IST
Nannaku prematho movie unit ready to shift spain for next schedule

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’లో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. సూపర్ క్లాస్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాకి సంబంధించి దసరా కానుకగా టీజర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే! ఆ టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా యూట్యూబ్ లో సెన్సేషనల్ రికార్డ్స్ సృష్టిస్తోంది. టీజర్ కే ఇంత రెస్పాన్స్ వస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కచ్చితంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని ట్రేడ్ వర్గాలు అప్పుడే అంచనా వేస్తున్నాయి.

ఇదిలావుండగా.. ఇటీవల లండన్ లో 80 రోజుల పాటు ఈ చిత్ర టీం మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసుకొని హైదరాబాద్ వచ్చింది. కొన్నాళ్లు ఇక్కడ సేద తీర్చుకున్న ఈ చిత్రబృందం.. ఇప్పుడు తదుపరి షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్ళేందుకు సిద్ధమవుతోంది. ఇదివరకే ఈ విషయాన్ని మూవీ యూనిట్ స్పష్టం చేసింది కూడా. కానీ.. ఎప్పుడు స్పెయిన్ వెళ్లనున్నారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా ఈ చిత్ర టీం స్పెయిన్ షెడ్యూల్ కి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ నెలాఖరున ఈ చిత్ర టీం స్పెయిన్ కు వెళ్లనుందని సమాచారం. అలాగే నవంబర్ 1 నుంచి స్పెయిన్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెడతారు. సుమారు 30 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఆ తర్వాత మిగిలి ఉన్న చిన్న చిన్న బిట్స్ ని హైదరాబాద్ లో షూట్ చేస్తారు.

జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2016 జనవరి 8న రిలీజ్ కానుంది. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ తోపాటు పాటల్ని కూడా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nannaku prematho  rakul preet singh  director sukumar  

Other Articles