the birthday darling prabhas got hollywood chances in two movies which has main roles | tollywood gossips

Prabhas birthday celebration hollywood offers bahubali rajamouli

prabhas news, prabhas birthday, prabhas bahubali, prabhas controversy, prabhas updates, prabhas news, prabhas hollywood offers, prabhas bahubali movie, bahubali part 2, prabhas darling

prabhas birthday celebration hollywood offers bahubali rajamouli : the birthday darling prabhas got hollywood chances in two movies which has main roles.

హాలీవుడ్ తెరపై బర్త్ డే ‘డార్లింగ్’ సందడి చేస్తాడా..?

Posted: 10/23/2015 03:25 PM IST
Prabhas birthday celebration hollywood offers bahubali rajamouli

‘డార్లింగ్’.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఎందుకంటే.. ఈరోజు డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే కావడమే దీనికి కారణం. ‘బాహుబలి’ సక్సెస్ తర్వాత వచ్చిన మొదటి బర్త్ డే కావడంతో డార్లింగ్ ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అయితే ఇప్పటికే ఫేస్ బుక్ లో #Prabhas యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చి ఊపేస్తోంది. అంతేకాకుండా టాలీవుడ్ సెటబ్రిటీలు సైతం హ్యాపీ బర్త్ డే డార్లింగ్ అంటూ సోషల్ సైట్లలో విషెస్ చెబుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి, అఖిల్ అక్కినేని, సమంత, తమన్నా, చార్మీ, సుమంత్, శర్వానంద్, కొరటాల శివ, సుజిత్ మొదలైన వాళ్లు ట్విటర్ ద్వారా తమ విషెస్ ను తెలియజేశారు.

ఇదిలావుండగా.. ప్రభాస్ కు సంబంధించి మరో ప్రచారం కూడా చక్కర్లు కొడుతోంది. ‘బాహుబలి’ గ్రాండ్ విజయంతో ప్రభాస్ కి జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు రావడంతో.. రెండు హాలీవుడ్ సినిమాల దర్శకనిర్మాతలు ఇతనిని సంప్రదించారని తెలుస్తోంది. ఆ రెండు సినిమాలకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యమని అంటున్నారు. ఒక సినిమాలో కథానాయకుడితో సమానమైన పాత్ర కాగా, మరొక సినిమాలో హీరోగా నటించే పాత్ర అని చెబుతున్నారు. ‘బాహుబలి’ చిత్రంతో అంతర్జాతీయ తెరపై హీరోగా సందడి చేసిన ప్రభాస్ క్రేజ్ ని, మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే హాలీవుడ్ నిర్మాతలు తమ సినిమాల్లో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు సాగుతున్నాయి. మరి.. ఫైనల్ రిజల్ట్ ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే.

హాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే.. ఇక అతగాడు అంతర్జాతీయ హీరో అయిపోతాడని, తెలుగులో నటించే ఛాన్సెస్ చాలా తక్కువగా వుంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఏదేమైనా.. ఓ తెలుగు హీరోకి ఇంత ఇమేజ్ దక్కడం నిజంగా గర్వించదగిన విషయమేనని అంటున్నారు. మరోవైపు.. ఇతనికి హాలీవుడ్ అవకాశాలు వచ్చాయన్న విషయం తెలిసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prabhas bahubali  prabhas hollywood offers  

Other Articles