Kanche | Release Date | Confirmed | Pragya Jaiswal

Kanche movie release date

Kanche Movie Release Date Confirmed, Kanche Movie Songs, Kanche Movie Latest Trailer, Kanche Movie News, Kanche Movie Updates, Kanche Movie Stills, Kanche Movie Details, Varun Tej Movie News, Varun Tej Movie updates, Varun Tej latest news, Varun Tej Latest Stills, Varun Tej

Kanche Movie Release Date: Varun Tej's Latest Film Kanche. directed by Krish. produced by Y Rajeev Reddy & J Sai Babu. music by Chirantan Bhat. Starring Varun Tej, Pragya Jaiswal

దసరాకు రానున్న వరుణ్ కంచె

Posted: 10/16/2015 10:49 AM IST
Kanche movie release date

‘ముకుంద’ తర్వాత వరుణ్ తేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కంచె’. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు ప్రతిష్టాత్మంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న గాంధీ జయంతి సంధర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర విడుదల తేదిని ఖరారు చేసారు. ‘కంచె’ను దసరా కానుకగా అక్టోబర్ 22న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించారు.

కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కూడా ఉండొచ్చునని దర్శకుడు క్రిష్ తెలిజేశారు. 1940 నేపథ్యంలో సాగే ఈ కథ ను మానవీయ విలువలతో దర్శకుడు క్రిష్ పూర్తి కమర్షియల్ హంగులతో, తన మార్కు విలువలను జోడిస్తూ తెరకెక్కించారు.

వరుణ్ సరసన ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్ గా నటించింది. చిరంతాన్ భట్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. మరి ఈ సినిమా వరుణ్ కు ఎలాంటి విజయాన్ని అందించనుందో త్వరలోనే తెలియనుంది.

ఈ చిత్రానికి కొరియోగ్రఫీ: బృంద, స్టంట్స్: వెంకట్, డేవిడ్ కుబువా, ఎడిటర్స్: సూరజ్ జగ్ తాప్, రామకృష్ణ అర్రమ్, ఆర్ట్: సాహి సురేష్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా,సాహిత్యం: సీతారామశాస్త్రి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జ్ఞాన‌శేఖ‌ర్‌, మ్యూజిక్: చిరంతన్ భట్ ,నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanche  Release Date  Confirmed  Pragya Jaiswal  Trailer  Krish  Stills  

Other Articles