Rakul preet singh | Brucelee The fighter | Movie news

Rakul preet singh acts with prabhas

Rakul preet singh acts with prabhas in mr.perfect film, Rakul preet singh acts with prabhas, Rakul preet singh acts in mr.perfect film, Rakul preet singh latest news, Rakul preet singh movie news, Rakul preet singh movie updates, Rakul preet singh stills, Rakul preet singh hot stills, Rakul preet singh interviews, Rakul preet singh

Rakul preet singh acts with prabhas: Tollywood star young actress Rakul preet singh acts with young rebel star prabhas in mr.perfect film.

ఈ అమ్మడిని మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి పీకేసారట!

Posted: 10/15/2015 05:09 PM IST
Rakul preet singh acts with prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ వస్తే ఏ అమ్మడు మాత్రం ఒప్పుకోకుండా వుంటుంది చెప్పండి! అలాంటిది ఓసారి హీరోయిన్ గా అవకాశం వచ్చి తప్పిపోయిందంటూ ఆ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది టాలీవుడ్ లేటెస్ట్ స్టార్ హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్.

ప్రభాస్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ సరసన కాజల్, తాప్సీలు హీరోయిన్లుగా నటించారు. అయితే తాప్సీ పాత్రకు ముందుగా రకూల్ ను తీసుకున్నారట. నాలుగు రోజులు షూటింగ్ కూడా జరిగిన తర్వాత ఓరోజు దిల్ రాజు ఫోన్ చేసి, నీ పాత్రలో తాప్సీ నటిస్తుందని చెప్పి కట్ చేసారని చెబుతోంది రకూల్.

అయితే తనని రిజెక్ట్ చేయడానికి కారణాలు మాత్రం చెప్పలేదని, కానీ ఈ పాత్రలో తన నటన, లుక్స్ బాగోలేకపోవడంతోనే రిజెక్ట్ చేసి వుంటారని భావించి అడ్జస్ట్ అయ్యిందట రకూల్. కానీ మొత్తానికి అపుడు దక్కని అదృష్టం త్వరలోనైనా దక్కుతుందని భావిస్తుంది రకూల్.

ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన ‘బ్రూస్ లీ-ది ఫైటర్’ చిత్రం ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. రాంచరణ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. థమన్ సంగీతం అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakul preet singh  Brucelee The fighter  Movie news  interviews  stills  

Other Articles