Ajithvasan Uggina | Movie news | stills | gallery | hot news

Ajithvasan uggina nri casting call gets overwhelming response

NRI Casting call gets overwhelming response, Ajithvasan Uggina latest news, Ajithvasan Uggina movies, telugu movies, tollywood, news, movies, stills, gallery, gossips, politics, hot news

Ajithvasan Uggina NRI Casting call gets overwhelming response: A Casting Call for a bilingual movie to be shot completely in USA with all NRI actors had got overwhelming response, according to the filmmakers. S A Media and People Media are jointly producing a bilingual movie in Tamil and Telugu. The movie is supposed to cast only NRIs.

ఎన్నారై ఆర్టిస్టులతో ఎస్.జె.సూర్య శిష్యుడి కొత్త చిత్రం

Posted: 10/06/2015 04:17 PM IST
Ajithvasan uggina nri casting call gets overwhelming response

తెలుగు సినిమాకి ఇటీవ‌ల ప్ర‌వాస భార‌తీయుల ఆద‌రణ అధిక‌మ‌యింది. ఇటీవ‌ల విడుద‌ల‌యిన బాహుబ‌లి, శ్రీమంతుడు, భ‌లేభ‌లే మ‌గాడివోయ్ వంటి చిత్రాల‌ను విశేషంగా ఆద‌రించి తెలుగు సినిమాపై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. అలాంటి ప్ర‌వాస భార‌తీయుల‌కు కూడా పూర్తిగా న‌టించే అవ‌కాశాన్ని ఎస్‌.ఎ.మీడియా పీపుల్ మీడియా క‌ల్పించారు. ఈచిత్రాన్నితెలుగు, త‌మిళ భాష‌ల్లో నిర్మిస్తున్నారు. ఖుషి చిత్ర ద‌ర్శ‌కుడు ఎస్‌.జె.సూర్య ద‌గ్గ‌ర ద‌ర్శ‌కత్వ శాఖ‌లో ప‌నిచేసిన అజిత్‌వాస‌న్ ఉగ్గిన ద‌ర్శ‌కుడిగా పరిచ‌య‌మ‌వుతున్నాడు. అమెరికా నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో న‌టించ‌టానికి అమెరికాలోని స్ధిర‌ప‌డ్డ భార‌తీయులే కావాలి అని ఒక్క ప్ర‌క‌ట‌నకి విశేష స్పంద‌న రావ‌టంతో యూనిట్ స‌భ్యులు ఆనందాన్ని వ్య‌క్తంచేశారు. ఏమాత్రం ఆలోచించ‌కుండా అతిత్వ‌ర‌లో ఇక్క‌డ చిత్రాన్ని ప్రారంభించి షూటింగ్ పార్ట్ మొత్తాన్ని అమెరికాలో చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు అజిత్‌వాస‌న్ ఉగ్గిన మాట్లాడుతూ.. తెలుగు భాష‌ల్లో క్రేజీస్టార్ కార్తి మాచిత్రం ఆడిష‌న్స్ కోసం ఓ ప్ర‌క‌ట‌న ఇవ్వ‌గానే అటు ప్ర‌వాసాంధ్రుల నుంచే కాకుండా ఇక్క‌డి ఇండియ‌న్స్ నుండి కూడా విశేష స్పంద‌న ఈమెయిల్స్ ద్వారా రావటంతో మా చిత్ర యూనిట్ ఆనందం లో ఉంది. అయితే మా కాన్సెప్ట్ ప్ర‌కారం మేము అమెరికాలోని ప్ర‌వాస భార‌తీయుల్ని మాత్ర‌మే ఎంచుకుని వారిలోని న‌ట‌నా టాలెంట్ ని చూపించాల‌నుకుంటున్నాము. మా ప్ర‌య‌త్నాన్ని అటు త‌మిళ్‌, ఇటు తెలుగు లోని అగ్ర హీరోలు, అగ్ర ద‌ర్శ‌కులు స‌పోర్టు చేయ‌ట‌మే కాకుండా మా యూనిట్ ని అభినందించారు. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో పూర్తిగా ప్ర‌వాసుల‌తో నిర్మించే తొలి చిత్రం ఇదే అవుతుంది. ఈచిత్ర క‌థ‌ని న‌మ్మి అమెరికాలో తీస్తే కొత్త‌గా వుంటుంద‌ని నిర్మాత‌లు ముందుకు వ‌చ్చారు, వారికి నా ధ‌న్య‌వాదాలు. ఈచిత్ర క‌థ అన్ని వర్గాల్ని అలరించే వినోదాత్మక చిత్రంగా ఉంటుంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా స‌రికొత్త ప్రేమ‌క‌థ‌గా తెర‌కెక్కిస్తున్నాము. త‌ప్ప‌కుండా అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. ఇలాంటి వైవిధ్యమైన క‌థ ఇప్ప‌టివ‌ర‌కూ రాలేద‌ని మేం న‌మ్ముతున్నాం మిగతా విశేషాలు అతిత్వ‌ర‌లో తెలియ‌జేస్తాం.

చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన సుభాష్ చంద్ర ఆకుల‌ మాట్లాడుతూ"మా బ్యాన‌ర్స్ ఎస్‌.ఎ.మీడియా, పీపుల్ మీడియా ప్రొడ‌క్ష‌న్ నెం1 గా రూపొందే చిత్రం కోసం అమెరికాలో ఆడిష‌న్స్ నిర్వ‌హించాల‌న్నాం. అక్క‌డున్న ప్ర‌వాసుల్ని న‌టీన‌టులుగా ప‌రిచ‌యం చేయ‌టానికి ఐదుగురు యువ‌కులు, ఎనిమిది మంది అమ్మాయిలు ప్ర‌ధాన తారాగాణం అంతా అమెరికా లోని ప్ర‌వాసుల‌ను ఆడిష‌న్స్ ద్వారా ఎంచుకుంటాం అని మేము ఇచ్చిన ప్ర‌క‌ట‌నకి విశేషంగా స్పంద‌న రావ‌టం చాలా ఆనందంగా వుంది. అతి త్వ‌ర‌లో వారంద‌రిని క‌లిసి ఆడిష‌న్స్ నిర్వ‌హిస్తాం. ఈచిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.జే.సూర్య వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన అజిత్‌వాస‌న్‌ ఉగ్గిన ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నాము. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సూప‌ర్‌స్టార్ మ‌హెష్ బాబు, అజిత్‌, ధ‌నుష్ లాంటి స్టార్ హీరోల చిత్రాల‌కు స‌హ‌య‌ద‌ర్శ‌కునిగా ప‌నిచేసిన అజిత్ వాస‌న్ మెట్ట‌మెద‌టి సారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్ర క‌థ ని అజిత్ వాస‌న్‌ మాకు చెప్ప‌గానే వెంట‌నే ఓకే చేశాము. అత‌ను చెప్పిన క‌థాంశం చాలా కొత్త‌గా వుంది. ఇది కొత్త‌ర‌కం ప్రేమ‌క‌థా చిత్రం గా ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. అజిత్ వాస‌న్‌ చాలా మంచి ద‌ర్శ‌కుడవుతాడు. మా చిత్ర కాన్సెప్ట్ చెప్ప‌గానే త‌మిళ‌, తెలుగు భాషల్లో అగ్ర హీరోలు, అగ్ర ద‌ర్శ‌కులు త‌మ అభినంద‌న‌లు తెలిపారు. వారికి మా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. అతిత్వ‌ర‌లోనే ఈచిత్రానికి సంభంధించిన పూజాకార్య‌క్ర‌మాలు పూర్తిచేసి, అమెరికాలో ఢిఫ‌రెంట్ లోకేష‌న్స్ లో ఆడిష‌న్స్ చేస్తాం. ఇంకా ఇంట్రెస్ట్ వున్న‌వారు త్వ‌ర‌గా మాకు This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. కు మెయిల్ చేయండి. ఆడిష‌న్స్ డేట్ ని అతిత్వ‌ర‌లో ఎనౌన్స్ చేస్తాము. త‌రువాత‌ షూటి్ంగ్ చేస్తాము. " అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajithvasan Uggina  Movie news  stills  gallery  hot news  

Other Articles