Ram Charan | BruceLee The Fighter | Audio Launch | Rakul preet singh | Trailers

Brucelee the fighter movie audio launch

Ram Charan BruceLee The Fighter Movie Audio Launch, Ram Charan BruceLee Movie Lehchalo Song Making Video, Tisca Chopra in Ram Charan BruceLee Movie, Ram Charan BruceLee Movie Songs, Ram Charan BruceLee Movie Audio, Ram Charan BruceLee Movie latest news, Ram Charan BruceLee Movie trailer, Ram Charan BruceLee Movie posters, Ram Charan BruceLee Movie stills, Ram Charan BruceLee Movie Updates, Ram Charan BruceLee Movie details, Ram Charan Movie News, Ram Charan Movie Updates, Ram Charan stills, Ram Charan latest news, Ram Charan, Rakul Preet singh latest news, Rakul Preet singh

BruceLee The Fighter Movie Audio Launch: Mega power star Ram Charan Tej Latest film BruceLee The Fighter. Rakul Preet singh heroine. Tisca Chopra acts in special role. Directed by Srinu Vaitla, produced by DVV Danayya and Music By Thaman. Movie will be release on 16 Oct. Chiranjeevi acts in special guest role.

మెగాస్టార్ చేతుల మీదుగా ‘బ్రూస్ లీ’ ఆడియో విడుదల

Posted: 10/03/2015 11:00 AM IST
Brucelee the fighter movie audio launch

దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్, రకూల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రూస్ లీ - ది ఫైటర్’. డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసారు. తొలి సీడీని చిరంజీవి విడుదల చేసి అల్లు అరవింద్, వినాయక్ లకు అందజేసారు. బిగ్ సీడీని చిరంజీవి ఆవిష్కరించారు.

ఈ సంధర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... ఈ సినిమాలో నా పాత్ర ఫుల్ మీల్స్ తిన్న తర్వాత డెసర్ట్ తిన్నట్లుగా వుంటుంది. ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడి ఓ సాధనలాగా చేసారు. నా పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యాక మానిటర్లో చూస్కుంటే.. హమ్మయ్యా.. పాసైపోయాం అని అనిపించింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

రాంచరణ్ మాట్లాడుతూ... ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఇందులో నటించిన నాన్నకు ప్రత్యేకంగా మా టీం అందరి తరపున ప్రత్యేకంగా థ్యాంక్స్. నేను గతంలో చేసిన సినిమాల్లో ఇంత ఫాస్ట్ గా, ఇంత క్లారిటీతో ఏ సినిమా చేయలేదు. కేవలం 5 నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేసి, 6వ నెల్లో సినిమాను విడుదల చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు.

ప్రముఖ రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ లు కథను అందిస్తున్నారు. చరణ్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. పవర్ ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి టిస్కా చోప్రా ఇందులో ఓ కీలక పాత్రలో నటించనుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  BruceLee The Fighter  Audio Launch  Rakul preet singh  Trailers  

Other Articles