Soggade Chinni Nayana Movie Gone For Reshoot Of Major Scenes | Ramya Krishna | Lavanya Tripathi | Akkineni Nagaruna

Soggade chinni nayana movie reshoot nagarjuna other celebrities ramya krishna lavanya tripathi

soggade chinni nayana, soggade chinni nayana reshoot, nagarjuna reshoot, nagarjuna soggade chinni nayana, akkineni nagarjuna movie updates, ramya krishna news, ramya krishna movie, lavanya tripathi news, lavanya tripathi photos, kalyan krishna news

Soggade Chinni Nayana Movie Reshoot Nagarjuna Other Celebrities Ramya Krishna Lavanya Tripathi : Soggade Chinni Nayana Movie Gone For Reshoot Of Major Scenes.

తప్పులు సరిదిద్దుకుంటున్న నాగార్జున

Posted: 10/01/2015 01:10 PM IST
Soggade chinni nayana movie reshoot nagarjuna other celebrities ramya krishna lavanya tripathi

ఐదుపదుల వయస్సు దాటినా ఇప్పటికీ టాలీవుడ్ మన్మథుడిగా చెలామణి అవుతున్న నాగార్జున కొన్ని తప్పులు చేశాడు. అనుకోకుండా జరిగిపోయిన ఆ తప్పులను సరిదిద్దుకునేందుకు రెడీ అయ్యాడు. ఇతనితోపాటు మరికొందరు సెలబ్రిటీలు కూడా ఆ తప్పులు చేయడంతో.. వారు కూడా సరిదిద్దుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇంతకీ వారు చేసిన తప్పేంటి? అని అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

‘మనం’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయంలో నటిస్తుండగా.. రమ్యక్రిష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా కనిపంచనున్నారు. ఆత్మల కాన్సెప్ట్ తో రానున్న ఈ సినిమా ఆధ్యంతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని ఈ చిత్ర టీం అంటోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి నాగార్జున, అతని ప్రొడక్షన్ టీం ప్లాన్ సన్నాహాలు చేస్తోంది. అయితే.. షూటింగ్ నిమిత్తం సినిమా మొత్తాన్ని ఎడిట్ రూంలో చూసుకున్న ఈ చిత్ర బృందంకు కొన్ని కీలక సీన్స్ సరిగా వచ్చినట్టు లేదని అనిపించిందట. దాంతో.. ఆ సీన్స్ మళ్లీ రీ షూట్ చేసే పనిలో ఉన్నారని తెలిసింది. నాగార్జునతో పాటు అందరు కీలక నటీనటులు మళ్ళీ రీ-షూట్ లో పాల్గొంటున్నారు. మేజర్ గా కొన్ని సీన్స్ మాత్రమె కావడం వలన ఈ చిత్ర టీం రీ షూట్ చేస్తోంది. ఈ రీ-షూట్ కంప్లీట్ త్వరగా కంప్లీట్ చేసి.. ఆడియో, సినిమా విడుదల తేదీలను ప్రకటించాలని యూనిట్ భావిస్తోందని తెలిసింది.

కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం కానున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఆగష్టు 29న నాగార్జున బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన ఫస్ట్ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే మరిన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : soggade chinni nayana  Akkineni Nagarjuna  ramya krishna  lavanya tripathi  

Other Articles

Today on Telugu Wishesh