మాస్ మహారాజా రవితేజ, మెగాహీరో వరుణ్ తేజ్ మధ్య క్లాష్ ఏర్పడనుంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిన్నటిదాకా సైలెంట్ గా వున్న వాతావరణం వారిరువురి క్లాష్ తో వయోలెంట్ గా మారనుందని అనుకుంటున్నారు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా.. సినిమాల విషయంలో! ఆ ఇద్దరు హీరోలు నటించిన తాజా చిత్రాలు ఒకేసారి విడుదల కానున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య నెలకొనే ఈ పోటీ చాలా ఆసక్తికరంగా వుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
రవితేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ‘బెంగాల్ టైగర్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! మాస్ ఎలిమెంట్స్ తో కూడిన కథా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో తమన్నా, రాఖీ ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 7వ తేదీన విడుదల కానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా రవితేజ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ఇక ఈ చిత్రం పాటలను అక్టోబర్ 17వ తేదీన విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘కిక్-2’ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ మూవీ కోసం రవితేజ చాలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. పైగా.. అతనిలాగే బలమైన కథ వుండటంతో ఈ చిత్రం కచ్చితంగా భారీ విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. గతంలో చెర్రీతో ‘రచ్చ’ సినిమా తీసి భారీ విజయం సాధించిన డైరెక్టర్ సంపత్ నంది ‘బెంగాల్ టైగర్’ ని తెరకెక్కించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ‘కంచె’ సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే! రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ ఓ సైనికుడి పాత్రలో కనిపంచనున్నాడు. అప్పటి పరిస్థితులను, యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించిందేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని ఓ సందర్భంలో క్రిష్ చెప్పారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబా, రాజీవ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు చింతాన్‌భట్ సంగీతం అందించారు. ఇందులో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటించగా.. ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ చిత్రంలో విలన్ గా నటించిన నికేతన్ ధీర్ ఇందులోనూ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాను నవంబర్ 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలా భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ వుంటుందని అంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more