Mass Maharaja Raviteja Took Marvelous Decision On Remuneration Issue | Tollywood Updates

Raviteja marvelous decision on remuneration issue

Raviteja News, Raviteja decision, raviteja latest updates, mass maharaja news, tollywood gossips, tollywood news, raviteja remuneration

Raviteja Marvelous Decision On Remuneration Issue : Mass Maharaja Raviteja Took Marvelous Decision On Remuneration Issue.

రవితేజలాగే అందరూ చేస్తే.. నిర్మాతలకు పండగే!

Posted: 09/19/2015 07:08 PM IST
Raviteja marvelous decision on remuneration issue

మాస్ మహారాజా రవితేజ తాజాగా ఓ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అతడు తీసుకున్న ఆ నిర్ణయాన్ని ప్రతిఒక్కరు పాటిస్తే.. నిర్మాతల ఆర్థిక పరిస్థితులు పూర్తిగా కాకపోయినా కాస్తైనా మెరుగుపడతాయని అందరూ చర్చించుకుంటున్నారు. ఇంతకీ రవితేజ తీసుకున్న నిర్ణయం ఏంటి? దాంతో నిర్మాతలకు కలిగే లాభం ఏంటి? అని అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

చిత్రపరిశ్రమలో స్థితిగతులు ఎలావున్నా అక్కడ పండేది ‘సక్సెస్’ మంత్రం మాత్రమేనని అందరికీ తెలుసు. ఏదైనా సినిమా సక్సెస్ అయితే.. నిర్మాతలకు లాభాల పంట పండటంతోపాటు అందులో నటించిన నటీనటులకు, తెరకెక్కించిన దర్శకుడికి ఓ మంచి ఇమేజ్ తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా తారల స్థాయి ఓ రేంజులో పెరిగిపోతుంది. దాంతో వారు తమ పారితోషికాన్ని పెంచేస్తుంటారు. అలా ఒక్కసారి పారితోషికం పెంచిన తారలు.. సక్సెస్ లేనప్పుడు తగ్గించడానికి ససేమిరా అంటుంటారు. సినిమా ఫెయిల్యూర్ అయితేనేం.. పారితోషికాన్ని తగ్గించేదిలేదంటూ మొండికేస్తుంటారు. కానీ.. రవితేజ మాత్రం అందుకు భిన్నంగా అడుగులు ముందుకేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ హీరో తన పారితోషికం తగ్గించుకోవడానికి సిద్ధపడినట్లు సమాచారం. ఇలా రవితేజ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటంటే.. ‘కిక్-2’ చిత్రం పరాజయం కావడమేనని అర్థమవుతోంది.

కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ వెచ్చించి నిర్మించిన ‘కిక్-2’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన విషయం తెలిసిందే! ఈ పరాజయంతో నిర్మాతకు ఎన్నో నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో రవితేజ తన పారితోషికం తగ్గించుకోవాలనే ఫిక్స్ అయినట్లు కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఓ ప్రణాళికను రూపొందించుకున్నాడని చెబుతున్నారు. దాని ప్రకారం.. సినిమా షూటింగుకి ముందు తనకి సగం పారితోషికమే ఇవ్వాలని, విడుదల తరువాత మిగతా పారితోషికం ఇవ్వమనేది రవితేజ మాటగా వినిపిస్తోంది. నష్టం వస్తే మిగతా పారితోషికం అవసరం లేదనీ.. లాభం వస్తే మాత్రం 20 శాతం వాటా ఇవ్వాల్సి వుంటుందని అతగాడు అంటున్నట్లుగా చెబుతున్నారు. ఈ షరతులన్నీ కూడా తనకి ముందుగా చెప్పిన గడువులోగా సినిమా పూర్తి చేస్తేనేనట! ఇలా అందరూ చేస్తే.. నిర్మాతలకు నష్టాలు తగ్గుముఖం పడుతాయని అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raviteja news  tollywood producers  

Other Articles