Sai Kumar | 40 years completes | Special News | Movies | Stills

Sai kumar completes 40 years in movies

Sai Kumar Completes 40 Years in Movies, Sai Kumar Completes 40 Years, Sai Kumar latest news, Sai Kumar movie news, Sai Kumar movie updates, Sai Kumar latest reports, Sai Kumar special articles, Sai Kumar videos, Sai Kumar police story, Sai Kumar awards, Sai Kumar wiki, Sai Kumar

Sai Kumar Completes 40 Years in Movies: Pudipeddi Saikumara Sarma, known by his screen name Sai Kumar, is an Indian film dubbing artist, turned actor and television presenter known for his works predominantly in Telugu, Kannada and Tamil cinema.

డైలాగ్ కింగ్ సాయికుమార్.. 40 ఏళ్ల సినీ ప్రస్థానం!

Posted: 09/12/2015 03:19 PM IST
Sai kumar completes 40 years in movies

ఆయన పేరులో సాయి... కానీ ఆయన మాట్లాడితే ఒక పవర్. చూడటానికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు... కానీ ఒక్కసారి పాత్రలో లీనమైతే నాలుగో సింహాన్ని చూపిస్తారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆయన మొదటి తొలిమెట్టు. నటుడిగా నాలుగో సింహం ఆయనకు భారీ గుర్తింపు. విలనిజంలో కూడా ఇంత పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పవచ్చు అనే కొంత పంథాను పరిచయం చేసారు. కేవలం విలన్లకే కాదు.. పలువురు హీరోల స్థాయిని పెంచింది కూడా ఈయన గాత్రమే. వయసు పెరుగుతున్నా కూడా తన మాటల్లో మాత్రం గంభీరం, ఆహార్యం తగ్గనే లేదు. మనిషి, మనసు రెండూ వెన్న. ఆయన చెప్పే డైలాగులకు, యాక్టింగ్ కు అభిమానులు నీరాజనాలు పట్టారు. అందుకే అభిమానులు ఆయనకు ‘డైలాగ్ కింగ్’ అనే బిరుదును అందించి సత్కరించారు. వారు మరెవరో కాదు... తెలుగు సినీ ఇండస్ట్రీ సగర్వంగా చెప్పుకునే డైలాగ్ కింగ్ సాయికుమార్.

Sai Kumar-02

సాయికుమార్ ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు పి.జె.శర్మ, కృష్ణజ్యోతి దంపతులకు ప్రథమ పుత్రుడు. 1961 జులై 27న కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లిలో జన్మించారు. తన తండ్రి పిజె శర్మ డబ్బింగ్ కళాకారుడు కావడంతో బాల్యం నుంచే డబ్బింగ్ రంగంపై ఆసక్తి కలిగింది.

1972 అక్టోబర్ 20 మద్రాస్ లో ‘వాణీ మహల్’లో నవ్వుల రారాజు రాజబాబు జన్మదిన సంధర్భంగా కాకరాల, జెవి మూర్తి గార్ల నేతృత్వంలో మయసభలో దుర్యోధనుడిగా రంగస్థల ప్రవేశం చేసారు. ఆ తర్వాత విశ్వనట చక్రవర్తి శ్రీ ఎస్వీ రంగారావు గారి ఆశీర్వాదంతో సాయికుమార్ నటప్రస్థానం మొదలయ్యింది. 1974లో తాతినేని ప్రకాష్ రావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘సంసారం’ అనే సినిమాలో శేఖర్ పాత్రకు మొట్టమొదటిసారిగా డబ్బింగ్ చెప్పారు.


Video Courtesy : ananthula naresh

1974-1975లో తాతినేని రామారావు దర్శకత్వంలో శోభన్ బాబు హీరోగా నటించిన ‘దేవుడు చేసిన పెళ్లి’ సినిమాతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించిన సాయికుమార్ కు... మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ఛాలెంజ్’ సినిమా ద్వారా కొత్త మలుపు వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

అయితే థ్రిల్లర్ మంజు దర్శకత్వంలో వచ్చిన ‘పోలీస్ స్టోరి’ చిత్రం ఓ చరిత్రను సృష్టించింది. అంతేకాకుండా ఈ సినిమా సాయికుమార్ ను ‘నాలుగో సింహం అగ్ని’ గా చేసింది. ఈ సినిమాలో ‘కనిపించే ఈ మూడు సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే... కనిపించని ఆ నాలుగో సింహమేరా ఈ పోలీస్.. అగ్ని.!’ అంటూ సాయికుమార్ చెప్పిన డైలాగ్ ఇప్పటికే మారుమ్రోగుతూనే వుంది.


Video Courtesy : Top Trendings

నందమూరి ఎన్టీఆర్ తో ‘మేజర్ చంద్రకాంత్’, నందమూరి బాలయ్యతో ‘సీమ సింహం’, నందమూరి కళ్యాణ్ రామ్ తో ‘పటాస్’... ఇలా మూడు తరాల హీరోలతో కలిసి నటించే అదృష్టం దక్కింది ఆయనకు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సాయికుమార్.. ఇప్పటివరకు ఎంతో మంది హీరోలకు తన గాత్రాన్ని అందించారు.

రాజశేఖర్, సుమన్, రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా, సిల్వర్ స్టర్ స్టాలిన్, మోహన్ లాల్, మమ్ముట్టి, సురేష్ గోపి, విష్ణు వర్ధన్, విజయ్ కాంత్, సత్యరాజ్, ప్రభు, అర్జున్... మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది హీరోలకు సాయికుమార్ తన గాత్రాన్ని అందించారు. మన తెలుగు హీరోలు నటించిన పలు చిత్రాలను సాయికుమార్ ఇతర భాషలలో డబ్బింగ్ కూడా చెప్పారు. అందులో చిరంజీవి, బాలకృష్ణ, రాజశేఖర్ వంటి తారల చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు.

Sai Kumar-03

డబ్బింగ్ ఆర్టిస్టుగా కొనసాగుతూనే నటుడిగా తన సత్తా ఏంటో నిరూపించుకుంటూ దూసుకొచ్చారు. తెలుగులోనే కాకుండా కన్నడ సినీ ఇండస్ట్రీలో కూడా సాయికుమార్ కు భారీ క్రేజ్ వుంది. నటుడిగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ సాయికుమార్ కు ఈ మధ్య వచ్చిన ‘ప్రస్థానం’ సినిమాతో భారీ గుర్తింపును తెచ్చిపెట్టింది. అంతేకాకుండా ఈ సినిమాలో సాయికుమార్ చెప్పిన ఒక్కొక్క డైలాగ్స్ సూపర్బ్. అలాగే రజినీకాంత్ నటించిన ‘బాషా’, ‘పెదరాయుడు’ చిత్రాల్లో సాయికుమార్ తన గాత్రాన్ని అందించారు. ఈ రెండు సినిమాలు కూడా భారీ విజయాలు సాధించాయి.

అలాగే కేవలం యాక్షన్ చిత్రాల్లోనే కాకుండా సాయికుమార్ సినీ కెరీర్ లో కూడా ఓ రొమాంటిక్ హిట్ సాంగ్ కూడా వుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘అంతపురం’ సినిమాలో సౌందర్యతో కలిసి నటించిన ‘అసలేం గుర్తుకురాదు..’ అనే పాట ఇప్పటికీ, ఎప్పటికీ ప్రేమికుల హాట్ ఫేవరేట్! డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సినీప్రస్థానం మొదలుపెట్టిన ఆయన కెరీర్ నేటికి 40 ఏళ్లు పూర్తయ్యింది. ఈ 40 ఏళ్లల్లో ఆయన 1000 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పారు.


Video Courtesy : Aditya Telugu & Hindi Movies

‘పోలీస్ స్టోరీ’లో నాలుగో సింహంగా ఇప్పటితరం వారికి కూడా సాయికుమార్ సుపరిచితులే. ఈ డైలాగ్ ను స్పూర్థిగా తీసుకొని విజయవాడ పోలీస్ వారు ‘నాలుగవ సింహం’ అనే అప్లికేషన్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. దీనికి సాయికుమార్ ను ప్రచారకర్తగా నియమించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడిగా, విలన్ గా పలు పాత్రలలో నటించి ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు.

సాయికుమార్ నటించిన ‘సామాన్యుడు’(2006) చిత్రానికి గాను ఉత్తమ విలన్ గా నంది అవార్డును అందుకున్నారు. అలాగే ‘ప్రస్థానం’(2010) సినిమాలోని ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ఫిల్మ్ ఫేర్, ప్రైవేట్ అవార్డులు, రివార్డులు ఆయనను వరించాయి.

Sai Kumar-04

కేవలం వెండితెర మీదనే కాకుండా బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాలతో టివీ ప్రేక్షకులకు కూడా సాయికుమార్ బాగా చేరువయ్యారు. 40 ఏళ్ల సినీ కెరీర్ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకొని, తన ప్రతిభతో ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు సాయికుమార్. ఆయన తనయుడు ఆది కూడా ప్రస్తుతం హీరోగా పలు చిత్రాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. మరి ఇలాంటి డైలాగ్ కింగ్ సాయికుమార్ మరెన్నో సినిమాల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా సినీ ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Sai Kumar  40 years completes  Special News  Movies  Stills  

Other Articles