మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ హీరోగా నటిస్తున్న ‘బ్రూస్ లీ’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్లకు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇందులో చరణ్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రడక్షన్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేతృత్వంలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు.
తాజాగా ఈ పాటకు సంబంధించిన స్టిల్స్ ను విడుదల చేసారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి కథను కోన వెంకట్, గోపి మోహన్ లు అందిస్తున్నారు.
కమర్షియల్ ఫ్యామిలీ, లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్ర విడుదల తేదిని చిత్ర యూనిట్ ఫిక్స్ చేసారు. అక్టోబర్ 16న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more