Ravi Teja | Bengal Tiger | First Look Poster | Rashi khanna | Tamanna | Movie News

Ravi teja bengal tiger first look poster release

Ravi Teja Bengal Tiger Movie First Look Poster, Global Cinemas Bags Nizam Rights of Bengal Tiger, Bengal Tiger Movie Latest Updates, Bengal Tiger Movie News, Bengal Tiger Movie Shooting Updates, Bengal Tiger Movie Details, Raviteja Movie news, Raviteja movie updates, Raviteja latest news, Raviteja movies, Raviteja movie stills, Raviteja

Ravi Teja Bengal Tiger First Look Poster Release: Mass Maharaja Raviteja upcoming film Bengal Tiger. Sampath Nandi direction, KK Radhamohan producer. Tamanna, Rashi khanna heroines. Bengal Tiger Movie First Look Poster Released.

బెంగాల్ టైగర్ ఫస్ట్ లుక్ విడుదల... పేరులోనే టైగర్!

Posted: 09/04/2015 11:03 AM IST
Ravi teja bengal tiger first look poster release

‘కిక్2’ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బెంగాల్ టైగర్’. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ప్రముఖ నిర్మాత కె కె రాధామోహన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.

తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. టైటిల్ లో వున్న పవర్... ఈ పోస్టర్లో కనిపించడం లేదు. దీంతో సినిమా ఎలా వుండబోతుందోనని అందరిలో ఉత్కంఠ మొదలయ్యింది. పవర్ ఫుల్ యాక్షన్, కామెడీ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ సరసన రాశిఖన్నా, తమన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

‘కిక్2’ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో... ఈసారి ‘బెంగాల్ టైగర్’తో ఎలాగైనా హిట్టుకొట్టాలని రవితేజ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ‘బెంగాల్ టైగర్’ చిత్రానికి సంబంధించిన నైజాం హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ చిత్రంలో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, బ్రహ్మనందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హ‌ర్హవ‌ర్ధన్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్రభు, ప్రగ‌తి, నాగినీడు, ప్రభ‌, ర‌మాప్రభ తదిత‌రులు నటిస్తున్నారు.

బ్యాన‌ర్‌ : శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌, కెమెరా: సౌంద‌ర్ రాజ‌న్‌, ఎడిట‌ర్‌: గౌత‌ం రాజు, ఆర్ట్‌: డి,వై.స‌త్యనారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మణ్‌, సంగీతం భీమ్స్‌, నిర్మాత‌: కె.కె.రాధామెహ‌న్‌, క‌థ‌-మాట‌లు-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శకత్వం: సంప‌త్ నంది.

Ravi Teja Bengal Tiger Movie First Look Poster-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja  Bengal Tiger  First Look Poster  Rashi khanna  Tamanna  Movie News  

Other Articles