మాస్ మహారాజ రవితేజ నటించిన ‘కిక్2’ సినిమా ఇటీవలే విడుదలై మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో వచ్చిన ‘కిక్’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ నిర్మించాడు. ‘కిక్’ చిత్రానికి దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి.. ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు.
ఇందులో రాబిన్ హుడ్ పాత్రలో రవితేజ అదరగొట్టాడు. కానీ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో కొనసాగగా... సెకండ్ హాఫ్ మొత్తం కూడా పూర్తి యాక్షన్ ఎపిసోడ్స్ తో భీభత్సం సృష్టించేసింది. అలాగే సినిమా నిడివి చాలా ఎక్కువ అయ్యిందనే టాక్ కూడా వచ్చింది. ఈ విషయంపై రవితేజ కూడా తాజాగా స్పందించారు.
రవితేజ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడుతూ... నా ప్రతి సినిమా విషయంలో సినిమా ఫైనల్ కాపీ చూసిన తర్వాతనే దానిపై ఫైనల్ జడ్జ్ మెంట్ తీసుకుంటాను. కానీ ఈసారి డైరెక్టర్ సురేందర్ రెడ్డిని నమ్మి ఫైనల్ జడ్జ్ మెంట్ అతనికే వదిలేసాను. కానీ సినిమా లెంగ్త్ ఎక్కువయ్యిందని తనకు చెప్తూనే వున్నాను. కానీ తను వినకుండా.. పర్ఫెక్ట్ గానే వుందని చెప్పుకొచ్చాడు. కానీ సినిమా విడుదలయ్యాక ఓ మంచి లెసన్ నేర్చుకున్నాను అని రవితేజ చెప్పుకొచ్చాడు.
అంతే కాకుండా... ‘కిక్2’ ద్వారా ఓ మంచి లెసన్ నేర్చుకున్నాను. తర్వాత ‘కిక్3’ వుంటుంది కానీ.. ఆ సినిమా విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటానని రవితేజ చెప్పుకొచ్చాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం అన్నిచోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో కొనసాగుతోంది. రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more