Raj Tarun | Movie Shooting | Chikmagalur

Raj tarun latest movie shooting in chikmagalur

Raj Tarun New Movie Shooting in Chikmagalur, Raj Tarun movies, Raj Tarun latest movies, Raj Tarun latest film updates, Raj Tarun movie news, Raj Tarun movie updates, Raj Tarun stills, Raj Tarun

Raj Tarun Latest Movie Shooting in Chikmagalur: Raj Tarun upcoming film under srinivas gavireddy direction. arthana heroine. this film shooting in Chikmagalur.

వయ్యరి భామతో చిక్‌మగళూర్‌లో రాజ్‌తరుణ్

Posted: 08/27/2015 10:23 AM IST
Raj tarun latest movie shooting in chikmagalur

తొలిచిత్రం ‘ఉయ్యాలా జంపాలా’తో విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు రాజ్‌తరుణ్. తాజాగా ‘సినిమా చూపిస్తా మామ’తో బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ కొట్టిన రాజ్‌తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం చిక్‌మగళూర్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.శైలేంద్రబాబు, శ్రీధర్‌రెడ్డి కేవీ, హరీష్.డి. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ ఖరారు కాని ఈ చిత్రానికి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడు.

ప్రస్తుతం చిక్‌మగళూర్‌లో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ.... ‘సరికొత్త కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో రాజ్‌తరుణ్ పాత్ర వైవిధ్యంగా వుంటుంది. నేటి యువతరానికి ప్రతినిధిగా కనిపిస్తాడు. ప్రస్తుతం చిక్‌మగళూర్‌లో రాజ్‌తరుణ్, నాయిక ఆర్తనలపై రామజోగయ్య శాస్త్రి రచించిన ఓ పాటను గణేష్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 30వరకు జరిగే ఈ షెడ్యూల్‌లో మరో పాటను కూడా చిత్రీకరిస్తాం.దీంతో తొంభై శాతం షూటింగ్ పూర్తవుతుంది.తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అని తెలిపారు.

రాజ్ తరుణ్, ఆర్తన జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజారవీంద్ర, సురేఖావాణి, షకలక శంకర్, మధు, జోగినాయుడు, శ్రీలక్ష్మీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: విశ్వ, సమర్పణ: శ్రీమతి పూర్ణిమ, ఎస్.బాబు, నిర్మాతలు: ఎస్.శైలేంద్రబాబు, శ్రీధర్‌రెడ్డి కెవీ, హరీష్.డి, కథస్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raj Tarun  Movie news  stills  Chikmagalur  Arthana  

Other Articles