Anushka Size Zero Movie Title Logo Launch

Anushka size zero movie title logo launch

Anushka Size Zero Logo Launch, Anushka Size Zero Title Logo Launch, Anushka Size Zero Movie Logo Launch, Anushka Size Zero Title Logo, Anushka Size Zero Title Logo Poster, Anushka Size Zero movie news, Anushka Size Zero movie updates, Anushka Size Zero stills, Anushka Size Zero, Anushka, Size Zero

Anushka Size Zero Movie Title Logo Launch: South actress Anushka upcoming film Size Zero. Prakash kovelamudi direction, MM Keeravani music, PVP Produce. Arya acts in lead role. Size Zero Movie Title Logo Launched.

అనుష్క సైజ్ జీరో టైటిల్ లోగో విడుదల

Posted: 08/11/2015 09:40 AM IST
Anushka size zero movie title logo launch

‘రుద్రమదేవి’, ‘బాహుబలి - ది బిగినింగ్’ చిత్రాల తర్వాత అందాల భామ అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘సైజ్ జీరో’. అనుష్క ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ పై నిర్మాత ప్రసాద్.వి.పోట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నెల చివర్లో షూటింగ్ పూర్తిచేసుకోనుంది. ఇందులో అనుష్క ద్విపాత్రాభినయం చేయనుంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్ర టైటిల్ లోగోను విడుదల చేసారు. ‘సైజ్ జీర్’ అనే ఈ చిత్రానికి ‘సన్నజాజి నడుము’ అనే క్యాప్షన్ ను పెట్టారు.

ఇందులో తమిళ నటుడు ఆర్య ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. మరికొద్ది రోజుల్లోనే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka  Size Zero  Title Logo  Movie News  Arya  

Other Articles