Mahesh Srimanthudu Movie Tickets Online Booking

Mahesh srimanthudu movie tickets online booking

Srimanthudu Movie Tickets Prices, Srimanthudu online booking, Srimanthudu tickets, Srimanthudu show, Srimanthudu special show, Srimanthudu movie stills, Srimanthudu news, Srimanthudu posters, Srimanthudu trailers, Srimanthudu songs, Srimanthudu latest news, Srimanthudu latest updates, Srimanthudu movie details, Srimanthudu movie cast and crew, Srimanthudu, Mahesh Babu, Shruti Haasan, Shruti Haasan stills

Mahesh Srimanthudu Movie Tickets Online Booking: Starring Mahesh Babu, Shruthi Hasan,Music Composed by Devi Sri Prasad,Directed by Koratala Siva,Produced by Y.Naveen, Y.Ravi, C.V. Mohan Under the Banner of Mythri Movie Makers.

భారీ ధరకు మహేష్ శ్రీమంతుడు టికెట్లు

Posted: 08/06/2015 01:35 PM IST
Mahesh srimanthudu movie tickets online booking

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాను మొదటిరోజు మొదటి షో కే చూసేయ్యాలని సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమా టికెట్లు దొరకక అభిమానులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారం రోజుల వరకు కూడా హౌస్ ఫుల్ బుకింగ్ లతో కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం ‘శ్రీమంతుడు’ సినిమా టికెట్లకు అభిమానులు పలు సినిమా థియేటర్ల వద్ద భారీగా క్యూ కట్టారు. ‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్ లో అదే రేంజులో ‘శ్రీమంతుడు’ సినిమా కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో టికెట్ల కోసం క్యూ కడుతున్నారు ఇప్పటికే ‘శ్రీమంతుడు’ సినిమా టికెట్ల బుకింగ్స్ ప్రారంభమై హౌస్ ఫుల్ గా బుక్ అవుతున్నాయి.



అయితే ‘శ్రీమంతుడు’ టికెట్ల రేట్లు భారీ రేటు పలుకుతున్నాయి. ఆన్ లైన్లో బుకింగ్ ధరలు పర్వాలేదనిపించినప్పటకి, సాధారణ టికెట్ల రేట్లు మాత్రం భారీ ధరకు బ్లాక్ లో అమ్ముడుపోతున్నాయి. రేపు విడుదలయ్యాక ఈ టికెట్ల ధర మరింత పెరిగే అవకాశాలు చాలా వున్నాయి.

మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఈనెల 7వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం భాషలలో గ్రాండ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. యూట్యూబ్ లో ఈ పాటలు రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి.



ఈ చిత్రంలో జగపతి బాబు, సుకన్య, రాజేంద్రప్రసాద్, రాహుల్ రవీంద్రన్, పూర్ణ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందింది. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రాన్ని తమిళంలో ‘సెల్వాందన్’ పేరుతో విడుదల చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Srimanthudu  Movie Tickets  Online Booking  Shruti Haasa  Trailers  

Other Articles