Mega Hero Sai Dharam Tej To Romance With Five Heroines In His Latest Movie | Tollywood

Mega hero sai dharam tej to romance five heroines in latest movie tollywood

sai dharam tej, sunil reddy, director sunil reddy, sai dharam tej romance, sai dharam tej affairs, sai dharam tej sunil reddy, producer dil raju, tollywood heroines, telugu actresses, tollywood gossips, telugu movie news

Mega Hero Sai Dharam Tej To Romance Five Heroines In Latest Movie Tollywood : The Young Mega Hero Sai Dharam Tej To Romance With Five Heroines In His Latest Movie Which Is To Be Directed By Sunil Reddy Who Has Already Worked With Kalyan Ram Om Movie.

ఐదుగురితో మెగాహీరో అదరహో..?

Posted: 07/25/2015 10:47 AM IST
Mega hero sai dharam tej to romance five heroines in latest movie tollywood

ఇటీవలేకాలంలో వస్తున్న సినిమాల్లో హీరో సరసన ఇద్దరు హీరోయిన్లు నటించడం కామన్ అయిపోయింది. మరికొన్ని సినిమాల్లో స్ర్కిప్ట్ డిమాండ్ ని బట్టి ముగ్గురు నటించిన సందర్భాలూ వున్నాయి. కానీ.. ఇందుకు భిన్నంగా ఓ మెగాహీరో మాత్రం ఐదుగురు హీరోయిన్లతో కలిసి అదరహో అనిపించేందుకు సిద్ధపడుతున్నాడు. ఆ మెగాహీరో మరెవ్వరో కాదు.. ‘పిల్లా నువ్వులేని జీవితం’ తొలివిజయంతో ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్. ఇతను త్వరలోనే చేయనున్న తాజా చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు నటించనున్నారని సమాచారం.

గతంలో కల్యాణ్ రామ్ తో ‘ఓమ్’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సునీల్ రెడ్డి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం ఈనెల 31వ తేదీన పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. ఇందులో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటిస్తుండగా.. మరికొంతమంది భారీ తారాగణం కూడా నటించనున్నారు. ఇక ఇందులో సాయి సరసన ఐదుగురు హీరోయిన్లు నటించనున్నారట. ఈ సినిమా స్ర్కిప్టు డిమాండ్ నేపథ్యంలోనే ఇలా ఐదుగురు అమ్మాయిలని తీసుకోనున్నారట. అయితే.. ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. ఒకవేళ ఇది నిజమే అయితే.. ఐదుగురు భామలతో రొమాన్స్ చేసే హీరోగా టాలీవుడ్ లో ఇతనే మొదటివాడవుతాడు.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రంలో నటిస్తున్నాడు. రెజీనా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘గబ్బర్ సింగ్’ సినిమాని తెరకెక్కించిన హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘పిల్లా నువ్వులేని జీవితం’తో సాయిని తెలుగుతెరపై ఎంట్రీ చేయించిన నిర్మాత దిల్ రాజే ఈ మూవీని నిర్మిస్తున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sai dharam tej  director sunil reddy  producer dil raju  tollywood gossips  

Other Articles