Bajrangi Bhaijaan Film Release Theaters

Bajrangi bhaijaan film release theaters

Bajrangi Bhaijaan Film Release Theaters, Aaj Ki Party Song Video, Bajrangi Bhaijaan latest news, Bajrangi Bhaijaan movie news, Bajrangi Bhaijaan movie updates, Bajrangi Bhaijaan stills, Bajrangi Bhaijaan posters, Bajrangi Bhaijaan

Bajrangi Bhaijaan Film Release Theaters: Salman khan upcoming film Bajrangi Bhaijaan. kareena kapoor heroine. Kabheer khan director.

ప్రపంచ వ్యాప్తంగా ‘భజ్రంగీ భైజాన్’ హల్ చల్

Posted: 07/15/2015 11:01 AM IST
Bajrangi bhaijaan film release theaters

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ‘భజ్రంగీ భైజాన్’ హవా మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లు దుమ్మురేపుతున్నాయి. ఇందులో సల్మాన్ ఖాన్ చాలా సింపుల్, పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. సల్మాన్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది.

ఇటీవలే ఈ సినిమాలోని ‘ఆజ్ కీ పార్టీ..’ అంటూ ఓ పాటను విడుదల చేసి, అభిమానులకు సల్మాన్ ఫుల్ జోష్ పార్టీని అందించాడు. రంజాన్ సంధర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 17న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

గతంలో సల్మాన్, కబీర్ ఖాన్ ల కలయికలో వచ్చిన ‘ఏక్ థా టైగర్’ బ్లాక్ బస్టర్ హిట్టయ్యి, భారీ కలెక్షన్లను రాబట్టింది. మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ‘భజ్రంగీ భైజాన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని దాదాపు 50 దేశాల్లో 5000 థియేటర్లలో విడుదల చేయనున్నారు.

యూరప్, ఉత్తర ఆఫ్రికా, దక్షిణ అమెరికాలో దాదాపు 700 స్ర్కీన్స్‌ కాగా... అమెరికా, లండన్, దుబాయ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో 450 స్ర్కీన్స్‌తో ‘భజ్రంగీ భైజాన్’ చిత్రం విడుదల కానుంది. మొత్తానికి ఇప్పటి వరకు వున్న రికార్డులను ‘భజ్రంగీ భైజాన్’ చిత్రం బద్దలుకొట్టి, కొత్త రికార్డులను క్రియేట్ చేయనుందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman khan  Bajrangi Bhaijaan  Kareena Kapoor  Songs  Trailers  Release Date  Posters  News  

Other Articles