Court stays release of Mohalla Assi Film

Court stays release of mohalla assi film

Court stays release of Sunny Deol Mohalla Assi, Sunny Deol movie news, Sunny Deol movie updates, Sunny Deol police case, Sunny Deol news, Sunny Deol stills, Sunny Deol latest updates, Sunny Deol

Court stays release of Mohalla Assi Film: bollywood actor sunny deol latest film mohalla assi. Court stays release of Mohalla Assi.

సన్నీ మొహల్లా అస్సీ విడుదలపై కోర్టు స్టే

Posted: 07/01/2015 10:00 AM IST
Court stays release of mohalla assi film

బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ ప్రధాన పాత్రలో నటించిన ‘మొహల్లా అస్సీ’ చిత్రంపై కోర్టు స్టే విధించింది. ఈ చిత్రంలో కొన్ని అభ్యంతకరక సన్నివేశాలున్నాయంటూ సామాజిక స్వచ్ఛంద సంస్థ సర్వజన్ జాగృతి సంతష్ట ఇటీవలే ఈ సినిమాపై పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై కోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

చంద్ర ప్రకాశ్ దర్శకత్వంలో సన్నీడియోల్, సాక్షి తన్వర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రంలో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలున్నాయని ఢిల్లీకి చెందిన గుల్షన్ కుమార్ కోర్టులో పిటిషన్ వేసారు. ఆయన పిటీషన్ పై విచారణ చేపట్టిన కోర్టు మంగళవారం ఆ చిత్ర విడుదలను తాత్కలికంగా నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ చిత్ర ట్రైలర్ ను చూసిన అనంతరం కోర్టు ఈ తీర్పును తెలియజేసింది. ఇందులో ఒక మతాన్ని కించపరుస్తూ కొన్ని సన్నివేశాలున్నాయని, ఆ సన్నివేశాలు తొలగించేవరకు విడుదలను నిలిపివేయాలని కోర్టు పేర్కొంది. మరి చిత్ర దర్శకనిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Court stays  Sunny Deol  Mohalla Assi  Sakshi tanwar  

Other Articles