Vishal clarifies on Tamannah in pandem kodi sequel

Vishal clarifies on tamannah in pandem kodi sequel

Vishal clarifies on pandem kodi sequel heroine, Vishal clarifies on pandem kodi sequel, Vishal movie news, Vishal movie updates, Vishal latest news, Vishal latest updates, Vishal latest stills, Vishal news, Vishal movies, pandem kodi sequel, pandem kodi sequel updates, pandem kodi sequel news, pandem kodi sequel

Vishal clarifies on Tamannah in pandem kodi sequel: kollywood star hero vishal upcoming film under Lingu swami direction. Vishal clarifies on pandem kodi sequel heroine tamanna and samantha.

సమంత, తమన్నాలపై పందెంకోడి కామెంట్లు

Posted: 06/27/2015 01:10 PM IST
Vishal clarifies on tamannah in pandem kodi sequel

తమిళ స్టార్ హీరో విశాల్ నటించిన ‘పందెంకోడి’ చిత్రం తెలుగు, తమిళం భాషలలో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. విశాల్ కు కమర్షియల్ హిట్ ను అందించింది. ఈ సినిమాతో విశాల్ మాస్ హీరోగా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కబోతుంది.

‘పందెంకోడి’ చిత్రాన్ని తెరకెక్కించిన లింగుస్వామి దర్శకత్వంలోనే ఈ సీక్వెల్ తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో సమంతా హీరోయిన్ గా నటించబోతుందని గతకొద్ది రోజులుగా వార్తలొచ్చాయి. కానీ ఈ మధ్య తమన్నాను హీరోయిన్ గా ఖరారు చేసారంటూ వార్తలొస్తున్నాయి.

అయితే ఈ వార్తలపై విశాల్ తాజాగా స్పందించారు. ఈ సినిమా కోసం సమంతను గానీ, తమన్నాను గానీ తాము అసలే సంప్రదించలేదని, ప్రస్తుతం స్ర్కిప్టు పనులు నడుస్తున్నాయని విశాల్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసాడు. మరి ఈ సినిమా వివరాలను విశాల్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pandem kodi sequel  Vishal  Clarifies  Tweets  samantha  Tamannah  

Other Articles