Baahubali Malayalam Version Audio Launch Date

Baahubali malayalam version audio launch date

Baahubali Malayalam Audio Launch Date, Baahubali Malayalam Audio Launch, Baahubali movie updates, Baahubali latest stills, Baahubali latest posters, Baahubali movie stills, Baahubali audio details, Baahubali tamil updates, Baahubali hindi updates, Baahubali

Baahubali Malayalam Version Audio Launch Date: Prabhas Baahubali movie Malayalam version Audio Launch on 27 june. SS Rajamouli Direction, MM Keeravani Music.

బాహుబలి తమిళ, మలయాళ ఆడియో విశేషాలు

Posted: 06/24/2015 10:55 AM IST
Baahubali malayalam version audio launch date

‘బాహుబాలి’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ఇటీవలే బాలీవుడ్ నుంచి భారీగా మొదలయ్యాయి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రలలో రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, ప్రభాకర్, అడవి శేష్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించిన ఈ చిత్రానికి కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ అన్ని భాషలలో దుమ్మురేపుతోంది. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, మలయాళం భాషలలో కూడా ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది. ఇప్పటికే తెలుగు ఆడియో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అయితే ఈ చిత్ర తమిళ మరియు మలయాళం వర్షెన్ ల ఆడియో విడుదల కార్యక్రమాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు.

తమిళ వర్షెన్ ఆడియోను ఈనెల 24న విడుదల చేయనున్నారు. అలాగే జూన్ 27న కొచ్చిన్ లో మలయాళ వర్షెన్ ఆడియోను చాలా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. తమిళ, మలయాళ ప్రేక్షకులు కూడా ‘బాహుబలి’ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా ప్రై.లిమిటెడ్ బ్యానర్లో ప్రముఖ నిర్మాతుల శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జులై 10న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Malayalam  Audio launch  Prabhas  

Other Articles